ఈ మూడు ఉంటే చాలు చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా వారం రోజుల్లో వదిలించుకోవచ్చు!

చుండ్రు.( Dandruff ).

అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ఒకటి.స్త్రీ, పురుషులే కాకుండా పిల్లల్లో కూడా చుండ్రు సమస్య ఉంటుంది.

అందులోనూ ప్రస్తుతం చలికాలంలో చుండ్రు అనేది మరింత అధికమై తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది.

చుండ్రు కారణంగా తలలో దురద, చికాకు వంటివి తలెత్తుతాయి.జుట్టు రాలడం కూడా పెరుగుతుంది.

అందుకే చుండ్రును పోగొట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు కూడా చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టోన‌ర్ ను తప్పక వాడండి.ఈ హెయిర్ టోన‌ర్‌ ను తయారు చేసుకోవడానికి కేవలం మూడు పదార్థాలు ఉంటే సరిపోతుంది.

మరి ఆ మూడు పదార్థాలు ఏంటి.వాటితో హెయిర్ టోన‌ర్ ను ఎలా తయారు చేసుకోవాలి.

అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, ( Fenugreek )ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులను కూడా వాటర్ తో సహా వేసుకోవాలి.

"""/" / అలాగే రెండు లేదా మూడు మందార ఆకులను ( Hibiscus Leaves )తుంచి వేసుకోవాలి.

చివరిగా మూడు రెబ్బలు వేపాకు వేసి దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన హెయిర్ టోన‌ర్‌ సిద్ధమవుతుంది.

గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ లో తయారు చేసుకున్న టోన‌ర్ ను నింపుకోవాలి.

ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి హెయిర్ టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.

"""/" / 40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.

మూడు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే వారంలోనే రిజల్ట్‌ గమనిస్తారు.చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ‌ వేగంగా మాయమవుతుంది.

స్కాల్ప్ లోతుగా శుభ్రం అవుతుంది.ఆరోగ్యంగా మారుతుంది.

అలాగే ఈ హెయిర్ టోనర్ ను వాడటం వల్ల జుట్టు కుదుళ్లు బ‌లోపేతం అవుతాయి.

హెయిర్ ఫాల్ కూడా త‌గ్గుతుంది.

స్వీడన్ ట్రైన్‌లో AC లోపం.. ఎన్నారై మహిళకు 50% రిఫండ్..??