జామ పండుతో ఇలా చేశారంటే మీ చర్మం మెరిసిపోద్ది!

రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పండ్లలో జామ( Guava ) ఒకటి.వివిధ పోషకాలకు పవర్ హౌస్ లాంటి జామ పండ్లను పెద్దలే కాదు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

ఇమ్యూటీని ప‌వ‌ర్ ను పెంచ‌డంలో, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో జామ చాలా అద్భుతంగా తోడ్ప‌డుతుంది.

అయితే ఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచే సత్తా కూడా జామ పండుకు ఉంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జామ పండు ఫేస్ మాస్క్ ను ట్రై చేశారంటే మీ చర్మం మెరిసిపోవడం ఖాయం.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గింజ తక్కువగా ఉన్న కొన్ని జామ పండు ముక్కలు వేసి ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్( Oats Powder ) వేసుకోవాలి.

అలాగే మూడు టేబుల్ స్పూన్లు జామ పండు ప్యూరీ మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ జామ మాస్క్ ను తరచూ ప్రయత్నించడం వల్ల చాలా లాభాలు పొందుతారు.

జామ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.జామలోని యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టడంలో హెల్ప్ చేస్తుంది.

చర్మాన్ని మృదువుగా మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. """/" / మొటిమలు మచ్చలు నివారణకు ఇప్పుడు చెప్పుకున్న జామ మాస్క్ ఉత్త‌మంగా తోడ్పడుతుంది.

అంతేకాకుండా ఈ మాస్క్ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.మురికి మృత కణాలను తొలగిస్తుంది.

చర్మాన్ని దృఢంగా మరియు బిగుతుగా ఉంచడంలో కూడా ఈ మాస్క్ సహాయపడుతుంది.

రోజుకే 4 కోట్ల ఆదాయం.. కానీ ఈమెను చూస్తే అందరికీ ఎందుకింత అసహ్యం..?