అందాన్నే కాదు శనగపిండి జుట్టును కూడా పెంచుతుంది.. ఎలా వాడాలంటే..?

సాధారణంగా కొందరిలో హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.

దీనివల్ల జుట్టు పల్చగా మారిపోతూ ఉంటుంది.ఈ క్రమంలోనే జుట్టు ఎదుగుదలను పెంచుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే అలాంటి వారికి శనగపిండి( Gram Flour ) చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.

అందాన్నే కాదు శనగపిండికి జుట్టును పెంచే సత్తా కూడా ఉంది.మరి ఇంతకీ శనగపిండిని కురులకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి కొబ్బరి పాలును( Coconut Milk ) ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి, రెండు టేబుల్ స్పూన్లు మెంతి పిండి వేసుకోవాలి.

అలాగే సరిపడా ఫ్రెష్ కొబ్బరిపాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / 40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ సింపుల్ మాస్క్ ను వేసుకోవడం వల్ల మీ కురులకు చక్కని పోషణ అందుతుంది.

శనగపిండిలో ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం, సెలీనియం మరియు నియాసిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి జుట్టు కుదుళ్లను( Hair Roots ) బలోపేతం చేసి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

పల్చటి జుట్టును ఒత్తుగా మారుస్తాయి. """/" / అలాగే శనగపిండి మీ తలలో నూనెను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

ఇది చాలా జిడ్డుగా లేదా పొడిగా మారకుండా కాపాడుతుంది.అలాగే కొబ్బరి పాలు మీ జుట్టును మృదువుగా మరియు హైడ్రేట్ గా ఉంచే సహజ కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.

ఇక మెంతి పిండి జుట్టు రాలడాన్ని అరికడుతుంది.చుండ్రు సమస్యకు సమర్థవంతంగా చెక్ పెడుతుంది.

స్కాల్ప్ ను శుభ్రపరుస్తుంది.మరియు దురద, చికాకును నివారిస్తుంది.

ధనుష్ నయనతార వివాదంలో త్రివిక్రమ్.. పూనమ్ కౌర్ పోస్ట్ చూస్తే షాకవ్వాల్సిందే!