అవిసె గింజలతో ఇలా చేశారంటే వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. తెలుసా?
TeluguStop.com
జుట్టు అధికంగా ఊడిపోతుందా.? రోజురోజుకు కురులు పల్చగా మారిపోతున్నాయా.
? జుట్టు రాలడాన్ని( Hair Fall ) అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారా.? హెయిర్ గ్రోత్ ను( Hair Growth ) పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారా.
? అయితే అందుకు అవిసె గింజలు( Flax Seeds ) గ్రేట్ గా సహాయపడతాయి.
పోషకాలకు పవర్ హౌస్ లాంటి అవిసె గింజలు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే కాకుండా జుట్టు సంరక్షణకు మద్దతు ఇస్తాయి.
ముఖ్యంగా అవిసె గింజలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ మాస్క్ ను వేసుకున్నారంటే వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
"""/" /
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించిన అవిసె గింజలను మొత్తంగా వేసుకుని చాలా స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్,( Amla Powder ) రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
ఈ అవిసె గింజల మాస్క్ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అవిసె గింజల్లో మెండుగా ఉండే విటమిన్ ఇ ఫ్రీ రాడికల్స్ ఉనికిని తగ్గిస్తుంది.
స్కాల్ప్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.అలాగే ఈ అవిసె గింజల మాస్క్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు మరియు స్కాల్ప్‌లోని తేమను లాక్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.
విటమిన్ బి, మెగ్నీషియం, సెలీనియం మరియు రాగి వంటి వివిధ పోషకాలు జుట్టు ఎదుగుదలను పెంచుతాయి.
కురులు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.
రైలులో చోటులేదనేమో.. 290 కి.మీ. ఏకంగా రైలు కోచ్ కింద ప్రయాణించిన వ్యక్తి