మెరిసే చర్మం కోసం బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇది.. వారానికి 2 సార్లు వేసుకుంటే బ్యూటీ పార్లర్ కు వెళ్లక్కర్లేదు!

ఎటువంటి మచ్చలు మొటిమలు మరియు ముడతలు లేకుండా ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపిస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అటువంటి చర్మాన్ని పొందడం కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.నెలలో రెండు సార్లు బ్యూటీ పార్లర్ కు వెళ్లి ఫేషియల్, బ్లీచ్, టాన్ రిమూవింగ్ వంటివి చేయించుకుంటూ ఉంటారు.

ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. """/" / కానీ ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాక్( Face Pack ) చాలా బాగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, రెండు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ తురుము( Beetroot ) మరియు ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

"""/" / ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పదార్థాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, రెండు టేబుల్ స్పూన్లు పాలు( Milk ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని మెల్లమెల్లగా రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.

టాన్ రిమూవ్ అవుతుంది.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి కంట్రోల్ అవుతుంది.మొటిమల రావడం తగ్గుముఖం పడతాయి.

మచ్చలు మాయం అవుతాయి.చర్మం యవ్వనంగా కాంతివంతంగా మారుతుంది.

ముడతలు పరారవుతాయి.వారానికి రెండు సార్లు ఈ ఫేస్ మాస్క్ వేసుకుంటే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

స‌హ‌జంగానే మీరు అందంగా మెరిసిపోతారు.

వావ్, 12 ఏళ్లకే స్కూబా డైవింగ్‌లో ప్రావీణ్యత సాధించిన బెంగళూరు అమ్మాయి..?