ఈ ఎగ్ మాస్క్ తో ముఖానికి మెరుపు.. వారానికి ఒక్కసారి వేసుకున్న మస్తు బెనిఫిట్స్!

గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.గుడ్డు( Egg ) సంపూర్ణ పోషకాహారం.

రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తినడం వల్ల అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చు.

అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు గుడ్డులో ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ కూడా దాగి ఉంటాయి.

చర్మ సౌందర్యాన్ని ప్రోత్సహించడంలో గుడ్డు చాలా బాగా సహాయపడుతుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఎగ్ మాస్క్ ను( Egg Mask ) వారానికి ఒకసారి వేసుకుంటే మస్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్ ను బ్రేక్ చేసి వైట్ ను మాత్రం వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు ఏదైనా బ్రష్ సహాయంతో అప్లై చేసుకుని ప‌ది నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఉంచుకోవాలి.

"""/" / ఈలోపు స్కిన్ మొత్తం పూర్తిగా డ్రై అయిపోతుంది.అప్పుడు వాటర్ సహాయంతో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ ఎగ్ మాస్క్ ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల స్కిన్ అనేది టైట్ అవుతుంది.

ఏజింగ్( Aging ) ఆలస్యం అవుతుంది.ముడతలు, చారలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే ఈ ఎగ్ మాస్క్ చర్మానికి కొత్త మెరుపును అందిస్తుంది. """/" / స్కిన్ గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ ఎగ్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది.

అనేక రకాల విటమిన్లతో నిండి ఉండే ఈ ఎగ్ మాస్క్ పిగ్మెంటేషన్ సంబంధిత‌ మచ్చలను క్రమంగా మాయం చేస్తుంది.

క్లియర్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.కాబ‌ట్టి మెరిసే అంద‌మైన చ‌ర్మం కోసం ఈ ఎగ్ మాస్క్ ను త‌ప్ప‌క ప్ర‌య‌త్నించండి.

సాహో టీమిండియా.. రెండోసారి ప్రపంచకప్ కైవసం..