ఇక చుండ్రుతో నో టెన్షన్.. ఒక్క వాష్ లోనే వదిలించుకోండిలా!

ప్రస్తుత వ‌ర్షాకాలంలో అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో చుండ్రు( Dandruff ) ఒకటి.

వర్షాల్లో త‌ర‌చూ తడ‌వ‌డం, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఆడ మ‌గ అనే తేడా లేకుండా చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు.

చుండ్రు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? చుండ్రును వదిలించుకునేందుకు ముప్ప తిప్ప‌లు పడుతున్నారా? ఎంత ఖరీదైన షాంపూలను వాడిన పెద్దగా ఫలితం ఉండటం లేదా.

? అయితే టెన్షన్ వద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్‌ ఇంటి చిట్కాను కనుక పాటిస్తే ఒక్క వాష్‌లోనే ఈజీగా చుండ్రు మొత్తాన్ని వదిలించుకోవచ్చు.

మరి ఇంకెందుకు లేటు ఆ ఇంటి చిట్కా గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఒక నిమ్మ పండు( Lemon ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ‌చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మెంతులు వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు మరియు మెంతులు నానబెట్టుకున్న వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే చుండ్రు మొత్తం తొలగిపోతుంది.

మీ స్కాల్ప్ శుభ్రంగా మారుతుంది.ఒకవేళ ఇంకా చుండ్రు కనుక ఉంటే మరో రెండు సార్లు ఈ రెమెడీని పాటించండి.

శాశ్వతంగా చుండ్రు సమస్యకు బై బై చెప్పండి.పైగా వర్షాకాలంలో ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు నుంచి చెడు వాసన రాకుండా ఉంటుంది.

జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.మరియు కురులు హైడ్రేట్ గా సైతం ఉంటాయి.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్…