ఈ కాఫీ మాస్క్ తో మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది.. తెలుసా..?

మనలో చాలా మంది తమ జుట్టును ఒత్తుగా( Thick Hair ) మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

అందుకోసం రకరకాల కేశ ఉత్పత్తులను వాడుతుంటారు.అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రమే ఉందా.

? అయితే అస్సలు దిగులు చెందకండి.మన వంటింట్లో ఉండే కాఫీ పౌడర్( Coffee Powder ) తో హెయిర్ గ్రోత్ ను అద్భుతంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

అందుకోసం కాఫీ పౌడర్ ను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి.

అలాగే హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క( Cinnamon ) పొడి, రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ కి బాగా పట్టించి కనీసం ఐదారు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి. """/" / వారానికి ఒకసారి ఈ విధంగా కాఫీ మాస్క్ కనుక వేసుకున్నారంటే మీరు ఊహించని లాభాలు మీ సొంతం అవుతాయి.

కాఫీ పౌడర్ దాల్చిన చెక్క పెరుగు ఈ కాంబినేషన్ జుట్టు విషయంలో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది.

ఇవి తలలో బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తాయి.కొత్త జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.

కాఫీలోని ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు మృత చర్మ కణాలు, చుండ్రు మరియు తలపై పేరుకుపోయిన నూనెను తొలగించడంలో సహాయపడతాయి, జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

"""/" / కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టును పోషించి, మృదువుగా మరియు మెరిసేలా చేస్తాయి.

జుట్టు కుదుళ్లకు మరియు జుట్టుకు పోషణను అందించడానికి, వాటి ఆకృతిని మరియు మెరుపును మెరుగుపరచడానికి దాల్చిన చెక్క సహాయపడుతుంది.

ఇక పెరుగు జుట్టుకు మంచి తేమను అందిస్తుంది.పొడి జుట్టు సమస్యను నివారిస్తుంది.

మొత్తంగా ఈ కాఫీ మాస్క్ తో మీ జుట్టు విప‌రీతంగా పెరుగుతుంది.కొద్ది రోజుల్లోనే మీ కురులు ఒత్తుగా మార‌తాయి.