జుట్టును ఒత్తుగా పొడుగ్గా మార్చే దాల్చిన చెక్క.. ఎలా వాడాలంటే?

మన ఇండియన్ స్పైసెస్ లో దాల్చిన చెక్క( Cinnamon ) కూడా ఒకటి.

ప్రత్యేకమైన సువాసన, రుచి కలిగి ఉండే దాల్చిన చెక్కను వంటల్లో విరివిగా వాడుతుంటారు.

దాల్చిన చెక్కలో అనేక ర‌కాల పోషకాలు, ఔషధ గుణాలు ఉండ‌టం కార‌ణంగా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.

అంతే కాదండోయ్‌ జుట్టు సంరక్షణకు( Hair Care ) కూడా దాల్చిన చెక్క తోడ్పడుతుంది.

ముఖ్యంగా జుట్టును ఒత్తుగా పొడుగ్గా మార్చే సత్తా దాల్చిన చెక్కకు ఉంది.మరి ఇంతకీ జుట్టు కోసం దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి మ‌రియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) లేదా ఆలివ్ ఆయిల్‌ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక ఎగ్ వైట్( Egg White ) వేసుకుని మరోసారి కలుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

ముప్పై నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించే శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

"""/" / వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే మంచి లాభాలు పొందుతారు.

దాల్చిన చెక్క నెత్తికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

అలాగే గుడ్డులో ఉండే ప్రోటీన్లు కూడా హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తాయి.

ఫలితంగా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మారుతుంది. """/" / అలాగే దాల్చిన చెక్క మూలాల నుండి జుట్టును బలోపేతం చేస్తుంది.

హెయిర్ బ్రేకేజ్ సమస్యను దూరం చేస్తుంది.దాల్చిన చెక్క స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

దాల్చిన చెక్క‌లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చండ్రుకు కార‌ణ‌మ‌య్యే మలాసెజియాను అంతం చేస్తుంది.

చుండ్రును సంపూర్ణ‌గా నివారిస్తుంది.కాబ‌ట్టి, థిక్ లాంగ్ అండ్ హెల్తీ హెయిర్ ను కోరుకునేవారు త‌ప్ప‌కుండా పైన చెప్పిన మాస్క్ ను ప్ర‌య‌త్నించండి.

ఓడిపోతే కొత్త ప్రయాణం మొదలుపెట్టు… ఓటమి గురించి ఆలోచించకు: సమంత