ముఖంపై నల్లటి మచ్చలా.. క్యారెట్ తో ఈజీగా వదిలించుకోండిలా!

ముఖంపై నల్లటి మచ్చలా క్యారెట్ తో ఈజీగా వదిలించుకోండిలా!

చాలా మందికి ముఖంపై నల్లటి మచ్చలు( Dark Spots ) ఏర్పడుతుంటాయి.ఇవి ఓ పట్టాన అస్సలు పోవు.

ముఖంపై నల్లటి మచ్చలా క్యారెట్ తో ఈజీగా వదిలించుకోండిలా!

వీటి కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.ముఖంపై నల్లటి మచ్చలను వదిలించుకునేందుకు ఎన్నెన్నో ఖరీదైన క్రీములు వాడుతుంటారు.

ముఖంపై నల్లటి మచ్చలా క్యారెట్ తో ఈజీగా వదిలించుకోండిలా!

కానీ మన వంటింట్లో ఉండే క్యారెట్ తో( Carrot ) సుల‌భంగా మ‌రియు వేగంగా మచ్చలేని మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక చిన్న క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుము( Coconut ) లేదా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకోని మిశ్రమం నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ క్యారెట్ కొబ్బరి జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ చందనం పౌడర్, హాఫ్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకోవాలి.అయితే కళ్ళ వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి.

ఇక ఈ ప్యాక్ ను 20 నిమిషాల పాటు ఉంచుకొని ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు నుంచి మూడుసార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే ముఖం పై నల్లటి మచ్చలు క్రమంగా మాయమవుతాయి.

స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది. """/" / అలాగే ఈ రెమెడీ చర్మాన్ని హైడ్రేట్‌ గా ఉంచుతుంది.

డ్రై స్కిన్ సమస్యకు చెక్ పెడుతుంది.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి ముఖంపై నల్లటి మచ్చలు ఉన్నాయని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న‌ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్జ్‌ మీ సొంతం అవుతుంది.

రామ్ చరణ్ పెద్ది సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?