Cardamom : మొటిమలు, మచ్చలు వేధిస్తున్నాయా.. ఏలకులతో ఇలా చేశారంటే దెబ్బకు పరార‌వుతాయి!

మొటిమలు, మచ్చలు.చాలా మందిని సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో ఇవి ముందు వరుసలో ఉంటాయి.

మొటిమలు, మచ్చలు అందాన్ని పాడు చేస్తాయి.ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.

ఈ క్రమంలోనే వాటిని నివారించుకోవడం కోసం ఖరీదైన క్రీమ్‌ లను కొనుక్కొని చేసి వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అన్నది పక్కన పెడితే‌‌.‌.

అంద‌రి వంట గదిలో ఉండే ఏలకులు మాత్రం సమర్థవంతంగా మొటిమలు మచ్చలను తరిమి కొడతాయి.

సుగంధ ద్రవ్యాల రాణిగా ప్రసిద్ధి చెందిన ఏల‌కులను ఆసియా వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.

ఇవి ఆకుపచ్చ మరియు నలుపు అనే రెండు రకాల్లో అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు రకాల ఏల‌కులు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి.

అయితే ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.ఏలకులను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించవచ్చు.

ముఖ్యంగా చ‌ర్మంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లను క్లియ‌ర్ చేయ‌డానికి ఏల‌కులు గ్రేట్ గా స‌హాయ‌ప‌డ‌తాయి.

"""/" / అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఏలకుల పొడి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకుని అరగంట పాటు వదిలేయాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. """/" / ఏల‌కుల్లో( Cardamom ) యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

వీటి కారణంగా చర్మం పై మొటిమలు, మచ్చలు( Acne, Scars ) దెబ్బ‌కు పరారవుతాయి.

కొద్ది రోజుల్లోనే క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అలాగే తేనె సహజ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది.

చ‌ర్మాన్ని తేమ‌గా, ఆరోగ్యంగా మారుతుంది.అంతేకాకుండా ఏలకుల పొడి, తేనె కలిపి ముఖానికి రాయడం వల్ల స్కిన్ గ్లోయింగ్ గా మారుతుంది.

చర్మానికి చక్కని అనుభూతి కలుగుతుంది.చికాకు, ఇరిటేషన్, అలర్జీ వంటివి ఏమైనా ఉన్నా కూడా త‌గ్గు ముఖం పడతాయి.

ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం చేసిన హాలీవుడ్ బ్యూటీ.. మన దేశ సాంప్రదాయం పాటిస్తూ?