స్కిన్ వైట్నింగ్ కోసం బీట్ రూట్ సీరం.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!

బీట్ రూట్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.ఆరోగ్యపరంగా బీట్ రూట్ అంతులేని ప్రయోజనాలను చేకూరుస్తుంది.

అనేక జబ్బుల నుంచి రక్షిస్తుంది.అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే సత్తా కూడా బీట్ రూట్( Beetroot ) కు ఉంది.

ముఖ్యంగా స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడే వారికి బీట్ రూట్ ఉపయోగపడుతుంది.బీట్ రూట్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా సీరం ను తయారు చేసుకుని రెగ్యులర్ గా వాడితే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.

మరి ఇంతకీ బీట్ రూట్ తో సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న బీట్ రూట్ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించాలి.

ఆపై సన్నగా తురుముకుని ఒక రోజంతా ఎండలో పెట్టాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి పాత్రను పెట్టి అర కప్పు స్వచ్ఛమైన కొబ్బరినూనె ( Coconut Oil )మరియు అరకప్పు బాదం నూనె వేసుకోవాలిజ‌ అలాగే ఎండబెట్టుకున్న బీట్ రూట్ తురుము వేసుకొని చిన్న మంటపై దాదాపు పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే మన సీరం అనేది సిద్ధం అవుతుంది.

"""/" / స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత క్లాత్ సహాయంతో సీరం ను సపరేట్ చేసుకోవాలి.

ఈ బీట్ రూట్ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఆపై తయారు చేసుకున్న సీరంను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

"""/" / నిత్యం ఈ సీరం ను కనుక వాడితే చాలా కొద్ది రోజుల్లోనే మీ స్కిన్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

ప్రధానంగా మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.

ముడతలు చారలు వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు ఈ సీరంను వాడటం వల్ల చర్మం స్మూత్ గా మరియు ఎంతో బ్యూటిఫుల్ గా మారుతుంది.

కంటి చూపును పెంచే కొత్తిమీర.. ఎలా తీసుకుంటే మంచిది?