అరటిపండు ఆరోగ్యాన్నే కాదు జుట్టును పెంచుతుంది.. తెలుసా?
TeluguStop.com
సీజన్ తో పని లేకుండా ఏడాది పొడవునా లాభ్యమయ్యే పండ్లలో అరటి ఒకటి.
అతి తక్కువ ధరకే లభించినా అరటిపండ్లలో అనేక పోషకాలు నిండి ఉంటాయి.అయితే అరటిపండు( Banana ) ఆరోగ్యాన్నే కాదు జుట్టును( Hair ) సైతం పెంచుతుంది.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన ఒక అరటి పండును తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్,( Amla Powder ) రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
పది రోజులకు ఒకసారి ఈ అరటిపండు హెయిర్ మాస్క్ ను( Banana Hair Mask ) వేసుకోవడం వల్ల అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.
అరటిపండ్లు మీ జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.జుట్టును లోతుగా కండిషన్ చేయడానికి సహాయపడతాయి.
డ్రై హెయిర్ సమస్య దూరం అవుతుంది. """/" /
అరటి, ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రును తొలగిస్తాయి.
తల దురదకు చెక్ పెడతాయి.చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి ఇప్పుడు చెప్పుకున్న అరటిపండు మాస్క్ ఉత్తమమైన ఇంటి నివారణ.
తరచూ ఈ మాస్క్ వేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది. """/" /
అరటిపండులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు మద్దతు ఇస్తాయి.
అరటి పండు పొటాషియం మరియు ఇతర ఖనిజాలను కలిగి ఉంటుంది.అందువల్ల ఇది మీ స్కాల్ప్‌కు పోషణనిస్తుంది.
మరియు ఆరోగ్యకరమైన దృఢమైన జుట్టును మీ సొంతం చేస్తుంది.
ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్ వైరల్!