పెదాల చుట్టూ ఏర్పడిన నలుపును వదిలించడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి!
TeluguStop.com
సాధారణంగా కొందరికి ముఖం మొత్తం ఎటువంటి మచ్చలు లేకుండా తెల్లగా అందంగా ఉంటుంది.
కానీ పెదాలు( Lips ) చుట్టూ ఉన్న చర్మం మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటుంది.
విటమిన్ల లోపం, ఎండల్లో అధికంగా తిరగడం, హార్మోన్ చేంజ్, స్మోకింగ్ తదితర కారణాల వల్ల పెదాలు చుట్టూ నలుపు( Dark Lips ) ఏర్పడుతూ ఉంటుంది.
ఈ నలుపును ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.కానీ టెన్షన్ అక్కర్లేదు.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను ప్రయత్నిస్తే మీ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరికినట్లే.h3 Class=subheader-styleటిప్-1:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) హాఫ్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) వేసుకోవాలి.
అలాగే వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ మరియు సరిపడా పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పెదాలు చుట్టూ అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే పెదాల చుట్టూ ఏర్పడిన నలుపు వదిలిపోతుంది.
"""/" /
H3 Class=subheader-styleటిప్-2: /h3pఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి,( Multhani Mitti ) వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా ఫ్రెష్ పొటాటో జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మిశ్రమాన్ని పెదాలు చుట్టూ అప్లై చేసుకుని పూర్తిగా ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ చిట్కాను పాటించినా కూడా పెదాలు చుట్టూ ఏర్పడిన నలుపు మాయం అవుతుంది.
స్కిన్ కలర్ అనేది ఈవెన్ గా మారుతుంది. """/" /
H3 Class=subheader-styleటిప్-3:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కీర దోసకాయ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని పెదాలు చుట్టూ అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో కడిగేయాలి ఈ చిట్కాను పాటించినా మంచి రిజల్ట్ పొందుతారు.
ఈ లక్షణాలే మగవారి నిజమైన లక్షణాలు.. వైరల్ అవుతున్న మహేష్ బాబు పోస్ట్!