ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండకూడదంటే ఈ టిప్స్ ను ట్రై చేయండి!
TeluguStop.com
సాధారణంగా కొందరి స్కిన్ అనేది ఎటువంటి మచ్చలు లేకుండా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది.అటువంటి చర్మాన్ని అందరూ కోరుకుంటారు.
కానీ ఏదో ఒక కారణం వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడుతూనే ఉంటాయి.ఆ మచ్చలను వదిలించుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
అయితే ముఖంపై ఒక మచ్చ కూడా ఉండకూడదు అని భావించే వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ టిప్స్ ను ట్రై చేస్తే స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
టిప్-1: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ టమాటో ప్యూరీ( Fresh Tomato Puree ), వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ), వన్ టీ స్పూన్ హనీ ( Honey )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఆపై పది నిమిషాలు చర్మాన్ని ఆరబెట్టుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
రెగ్యులర్ గా ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే చర్మంపై ఎటువంటి మచ్చలు ఉన్న క్రమంగా మాయమవుతాయి.
అదే సమయంలో స్కిన్ టైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది. """/" /
టిప్-2: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloe Vera Gel ) పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic Turmeric ) వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో వాష్ చేసుకోవాలి.
ఈ రెమెడీని పాటించిన కూడా ముఖంపై మచ్చలన్నీ మాయమవుతాయి.చర్మం అందంగా ప్రకాశవంతంగా మారుతుంది.
మడతలు ఏమైన ఉన్నా తగ్గు ముఖం పడతాయి. """/" /
టిప్-3: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెత్తగా గ్రైండ్ చేసిన అరటిపండు పేస్ట్ ( Banana Paste )వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.
15 నిమిషాల తర్వాత వాటర్ శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై మచ్చలు తగ్గు ముఖం పడతాయి.
పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.చర్మం వైట్ గా గ్లోయింగ్ గా మారుతుంది.
ఈ హెయిర్ ప్యాక్ తో మీ జుట్టు రాలడం కాదు డబుల్ అవుతుంది..!