పది నిమిషాల్లో ముఖం తెల్లగా కాంతివంతంగా మారాలా.. అయితే ఈ రెమెడీస్ మీకోసమే!
TeluguStop.com
ఒక్కోసారి చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) పేరుకుపోయి నల్లగా నిర్జీవంగా మారుతూ ఉంటుంది.
అలాంటి సమయంలో ఏదైనా ఫంక్షన్ లేదా ముఖ్యమైన మీటింగ్ ఉంటే తెగ హైరానా పడిపోతుంటారు.
ముఖాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో అర్థంగాక సతమతం అవుతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీలను కనుక ఫాలో అయితే కేవలం పది నిమిషాల్లో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.
మరి లేటెందుకు ఆలస్యం ఆ రెమెడీస్ ఏంటో ఓ చూపు చూసేయండి. """/" /
రెమెడీ-1: హాఫ్ టమాటో( Tomato ) తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్( Sugar Powder ), వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత మిగిలిన హాఫ్ టమాటో తీసుకుని ముఖాన్ని బాగా రబ్ చేసుకోవాలి.
మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు రబ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ రెమెడీ చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలను తొలగిస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.
ఈ రెమెడీ క్షణాల్లో ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మెరిపిస్తుంది. """/" /
రెమెడీ-2: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్( Rice Flour ), రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు హనీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడివేళ్లతో చర్మాన్ని రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ రెమెడీ కూడా చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మార్చడానికి సహాయపడుతుంది.
అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.చర్మానికి కొత్త మెరుపును అందిస్తుంది.
వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!