తెల్లటి మెరిసేటి మోచేతుల కోసం ఇవి ప్రయత్నించండి!
TeluguStop.com
సాధారణంగా చాలా మందికి శరీరం మొత్తం తెల్లగా ఉంటే మోచేతులు( Elbows ) మాత్రం నల్లగా అసహ్యంగా కనిపిస్తుంటారు.
మోచేతులు నల్లగా మారడానికి కారణాలు అనేకం.అలాగే ఆ నలుపును తగ్గించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే తెల్లటి మెరిసేటి మోచేతులు మీ సొంతం అవుతాయి.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసరపిండిని వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప రసం మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు( Curd ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసుకుని పది నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
అనంతరం అర నిమ్మ చెక్కతో మోచేతులను రెండు నిమిషాల పాటు బాగా రుద్ది అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే మోచేతులు నలుపు క్రమంగా తగ్గు ముఖం పడుతుంది """/" /
అలాగే మోచేతుల నలుపును పోగొట్టడానికి మరొక అద్భుతమైన రెమెడీ కూడా ఉంది.
అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) మరియు ఒక స్పూన్ తులసి ఆకుల పొడి వేసి స్టవ్ పై ఒక నిమిషం పాటు వేడి చేయాలి.
గోరువెచ్చగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం మోచేతులను క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీ కూడా మోచేతుల నలుపును వదిలిస్తుంది.
తెల్లటి మెరిసేటి మోచేతులను మీ సొంతం చేసింది.ఇక ఈ టిప్స్ తో పాటు రెగ్యులర్ గా నైట్ బాత్ చేశాక మోచేతులకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
మాయిశ్చరైజర్ వల్ల మోచేతులు తేమగా, మృదువుగా ఉంటాయి.నలుపు సైతం మెల్లమెల్లగా మాయం అవుతుంది.
వీడియో: బిర్యానీలో ఐస్‌క్రీమా.. ఈ ఫుడ్ కాంబినేషన్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!