వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది.. ఆ రోజు గ్లోగా మెరిసిపోవాలంటే దీన్ని ట్రై చేయండి!
TeluguStop.com
ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే(ప్రేమికుల దినోత్సవం)ను జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే.
మరి కొద్ది రోజుల్లోనే ఫిబ్రవరి 14 రాబోతోంది.ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఎంతో సంతోషంగా వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక ఆ స్పెషల్ డేన తమను ప్రేమించే వారికి తాము అందంగా కనిపించాలనే కోరిక అందరికీ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే వాలెంటైన్స్ డేకి వారం ముందు నుంచే చర్మాన్ని గ్లోగా మార్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని ట్రై చేస్తే గనుక చాలా అంటే చాలా ఈజీగా ముఖాన్ని కాంతి వంతంగా మెరిపించుకోవచ్చు.
మరి ఆ రెమెడీ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.
? వంటి విషయాలను ఏ మాత్రం లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పాల పొడి, వన్ టేబుల్ స్పూన్ శెనగ పిండి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/"/
ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ క్యారెట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్, రెండు టేబుల్ స్పూన్స్ బీట్ రూట్ జ్యూస్, వన్ స్పూన్ అలోవెర జెల్ వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.