జ్ఞానం, విజయం పొందాలంటే దర్శించాల్సిన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు ఇవే!

సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతుల కుమారులైన వారిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కరు.సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విజయపతి గా,జ్ఞాన ప్రసాదిగా ఆయనను భావిస్తారు.

అతి పురాతనమైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని దర్శిస్తే తప్పకుండా జ్ఞానం, విజయం సొంతం అవుతాయని పండితులు చెబుతున్నారు.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తమిళనాడులో ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు చాలా ఉన్నాయి.ప్రతి సంవత్సరం స్వామి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర షష్టి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

తమిళనాడు లో అతి పురాతనమైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.మురుగనలాంగ్‌: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయాలలో మొదటగా చెప్పుకోవలసినది శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం.

ఈ ఆలయం మురుగనలాంగ్ ఆయన భార్యలైన దైవనాయకి, వల్లి నాయకిలకు అంకితం చేయబడినది.

సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలో దైవ నాయకిని, ప్రేమతో వల్లి నాయకిని గెలిచాడు.కుమురన్ కుంద్రన్ ఆలయం: కంచి మఠానికి చెందిన ఓ సాధువుఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ కొండపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని తెలిపారు.

కానీ అక్కడి ప్రజలు దీనిని నిర్లక్ష్యం చేశారు.20 సంవత్సరాల తర్వాత ఈ కొండపై మురుగన్ ఆయుధం కనిపించడంతో ఆలయ నిర్మాణం శరవేగంగా పూర్తి అయినది.

ఈ దేవాలయం పై సుందరమైన దేవతా విగ్రహాల అలంకరణలతో, దైవం ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు.

పళని మురుగన్ ఆలయం: పురాణాల ప్రకారం శివపార్వతులు తన కుమారులలో తిరిగి ఎవరైతే ముల్లోకాలలోని పుణ్య నదులలో స్నానమాచరించి కైలాసాన్ని చేరుకుంటారో వారికే విఘ్నాదిపత్యం దక్కుతుందని చెప్పడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన వాహనమైన నెమలి పై అన్ని లోకాలకు బయలుదేరుతాడు.

కానీ వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి కుమారస్వామి కంటే ముందుగా అక్కడ ప్రత్యక్షమై ఉంటాడు.

తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేయడం వల్ల ప్రపంచంలోని పుణ్య నదులలో స్నానాలు చేసినంత పుణ్యం వినాయకుడికి దొరకడం వల్ల ప్రథమ పూజ్యుడిగా వినాయకుడు అవుతాడు అన్న విషయం మన పురాణాలలో తెలుసుకున్నాం.

దీంతో ఆగ్రహం చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పలని వద్దే ధ్యానం ఆచరించి పరిపక్వత చెందినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి.

ఇంతటి పేరుగాంచిన, పురాతనమైన మురుగన్ ఆలయాలను దర్శించడం ద్వారా మనం అనుకున్న పనులలో విజయం సాధించడమే కాకుండా, మంచి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం.

Thaman : జరగండి జరగండి సాంగ్ ఆ సాంగ్ కు కాపీనా.. థమన్ పై ట్రోల్స్ మామూలుగా లేవుగా!