బిడెన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..ఇరకాటంలోకి నెట్టేశాడుగా..!!!

అమెరికాలో గన్ కల్చర్ కు ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం విధితమే కొన్ని రోజుల క్రితం ఓ స్కూల్ లో జరిగిన కాల్పుల ఘటనలో సుమారు 18 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరికి తెలిసిందే ఈ ఘటనతో మళ్ళీ ఒక్కసారిగా గన్ కల్చర్ పై అమెరికా వ్యపంగా చర్చలు మొదలయ్యాయి.

బిడెన్ ఈ ఘటనపై మాట్లాడుతూ చట్ట సభ్యులు అందరూ ఒకే మాటమీదకు వస్తే గన్ కల్చర్ ను నిర్మూలించవచ్చునని, అయితే గన్ కల్చర్ కు రిపబ్లికన్ పార్టీ నేతల మద్దతు ఉందని పరోక్షంగా ట్రంప్ ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేసారు.

పలు సర్వేలు, స్వచ్చంద సంస్థలు సైతం రిపబ్లికన్ పార్టీ నేతలు మద్దతు ఇవ్వడం వలెనే గన్ కల్చర్ అమెరికాలో ఇంతగా పెరిగిపోయిందని వ్యాఖ్యలు చేయడంతో రిపబ్లికన్ పార్టీ ఇరకాటంలో పడిపోయింది.

దాంతో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పార్టీని రక్షించుకునే పనిలో పడ్డారు.గన్ కల్చర్ కి తాను, తన పార్టీ వ్యతిరకమంటూ ప్రకటించారు.

పనిలో పనిగా తనదైన శైలిలో బిడెన్ పై విమర్శలు గుప్పించారు.అమెరికాలోని హ్యుస్టన్ లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ మిస్టర్ బిడెన్ మీరు ముందుగా అమెరికా ప్రజలను కాపాడే పని చేస్తే మంచిది వారిని కాపాడటం ఎంతో ముఖ్యం అంటూ వ్యంగ్యంగా చురకలు అంటించారు.

ఉక్రెయిన్ కు నిధులు ఇవ్వడం, వారిని రక్షించడం సరే ముందు అమెరికా ప్రజల ప్రాణాలు పోతున్నాయి, పసి పిల్లలు చనిపోతున్నారు, స్కూల్ లలో మారణహోమం జరుగుతోంది ముందు స్కూల్స్ లో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయండి, అందుకు గాను భారీ నిధులను మళ్ళించండి, తాను, తన రిపబ్లికన్ పార్టీ గన్ కల్చర్ కు వ్యతిరేకమని ముందు గన్ కల్చర్ ను నియంత్రించే మార్గాలను వెతకమని, ఆయుధ నియంత్రణ చట్టాలని తీసుకురావాలని సూచించారు.

ట్రంప్ తాజా వ్యాఖ్యలు తమ పార్టీపై నిందలు వేస్తున్న విమర్శకులకు ధీటుగా సమాధానం ఇచ్చాయని, ముఖ్యంగా డెమోక్రటి పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారని రిపబ్లికన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కరెంట్ ఉండదని అసత్య ప్రచారం..: డిప్యూటీ సీఎం భట్టి