పట్టువదలని ట్రంప్ అనుకున్నది చేసి చూపాడుగా...ఇక మిగిలింది..!!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంతటి మొండిఘటమో ప్రత్యేకించి చెప్పనవరం లేదు.

ఏదైనా ఒక విషయం పట్టుకున్నాడంటే సాధించే వరకూ వదిలిపెట్టడు.క్యాపిటల్ హిల్ దాడి ఘటన తరువాత ట్రంప్ చర్యలని తప్పుబట్టిన దిగ్గజ సోషల్ మీడియా సంస్థలు ట్రంప్ పై నిషేధిం విధించాయి.

దాంతో ట్రంప్ తనకంటూ ప్రత్యేకమైన సోషల్ మీడియా వ్యవస్థను సృష్టించుకుంటానని బహిరంగంగా ప్రకటించాడు.

అయితే తాజాగా ట్రంప్ అన్నట్టుగానే “ట్రూత్ సోషల్” అనే పేరుతో అచ్చం ట్విట్టర్ లు పోలిన విధంగా ట్రూత్ సోషల్ లు లాంచ్ చేశారు.

సరిగ్గా రెండు రోజుల క్రితం ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో మొట్టమొదటి ట్రూత్ చేసిన ట్రంప్ అతి త్వరలో ప్రజలకు, తన అభిమానులకు అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

అనుకున్నట్టుగానే నిన్నటి రోజున ఆదివారం ట్రంప్ ట్రూత్ సోషల్ లు విడుదల చేశారు.

ప్రస్తుతానికి ఈ సోషల్ మీడియా కేవలం యాపిల్ యాప్ స్టోర్ లో మొదటి సారిగా విడుదల చేసారు.

ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఈ ట్రూత్ సోషల్ విడుదలైన కొద్ది నిమిషాలలోనే వేలాది డౌన్లోడ్స్ అయ్యిందని యాప్ ను అభివృద్ధి చేసిన నిర్వాహకులు ప్రకటించారు.

కాగా.  """/" / ట్రంప్ టెక్నాలజీ మీడియా సంస్థలు మాట్లాడుతూ మార్చి చివరి నాటికి అన్ని హంగులతో చిన్న దిద్దుబాట్లతో అందరికి అందుబాటులో ఉంటుందని, ఈ యాప్ లో ఏమేమి ఉండాలి, ఎలాంటి మార్పులు చేయాలి అనే విషయాలని తెలియజేయాలని కోరారు.

ఇదిలాఉంటె ఫేస్ బుక్, ట్విట్టర్ లు ట్రంప్ ని నిషేధించిన తరువాత ట్రంప్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అవి కేవలం స్థానికంగా ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేవి, మీడియా కూడా ట్రంప్ యాక్టివిటీస్ ను పెద్దగా ఫోకస్ చేసేది కాదు.

దాంతో ప్రజలకు ఎక్కడ దూరమవుతాననే భయంతో ట్రంప్ తన టీమ్ తో ఈ ట్రూత్ సోషల్ ను ప్రారంభించారు.

ప్రస్తుతానికి యాపిల్ స్టోర్ లో అందుబాటులో ఉన్న ఈ యాప్, అతి త్వరలో మార్పుల తరవాత అన్ని వెర్షన్స్ లో అందుబాటులోకి రానున్నదని ట్రంప్ టెక్నాలజీ, మీడియా CEO డెవిన్ నూన్స్ తెలిపారు.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను అరికట్టే బెస్ట్ సొల్యూషన్ ఇది.. డోంట్ మిస్..!