జ్ఞానోదయం అయ్యింది కాబోలు : మొత్తానికి వెనక్కి తగ్గిన ట్రంప్..!!

అమెరికా లో జార్జ్ ప్లాయిడ్ హత్య అనంతరం జరిగిన అల్లర్లు ఏ స్థాయిలో అమెరికాలో ప్రభావం చూపించాయో ప్రత్యక్షంగా అందరూ చూసిందే.

ఫ్లాయిడ్ మరణంతో ఒక్క సారిగా నల్ల జాతీయులు అమెరికాలోని పలు నగరాలలో విధ్వంసం సృష్టించారు.

అమెరికా అధ్యక్ష భవనం వైపు దూసుకు వచ్చి ట్రంప్ కి చుక్కలు చూపించారు ఈ కారణంగానే ట్రంప్ బంకర్ లో తల దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇదిలాఉంటే నిరసన కారులపై మిలటరీ దింపుతా ఉక్కు పాదంతో అణిచేస్తా.అది చేస్తా ఇది చేస్తా అంటే వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఒక్క సారిగా నిన్నటి రోజున వెనక్కి తగ్గారు.

మొన్నటి వరకూ నిరసన కారులని రెచ్చ గొడుతూ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన ట్రంప్ ఊహించని విధంగా తన దూకుడుని తగ్గించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు నిరసన కారులని నిలువరించడంలో విఫలం అయ్యాయంటూ ఫైర్ అయిన ట్రంప్ ఇప్పుడు నిరసన కారులని శాంతిప చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

"""/"/ స్థానిక ప్రభుత్వాలు ప్రస్తుత హింసాత్మక పరిస్థితులని అదుపులోకి తేవాలని ఆదేశించారు.నిన్న రోజున హింసాత్మక సంఘటనలు కొంచం తగ్గాయని త్వరలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

సైన్యాన్ని దించి నిరసన కారులని అణిచి వేయాలని చేసిన ఆలోచనలని వెనక్కి తీసుకుంటున్నామని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే ట్రంప్ మిలటరీ ని దించుతానని చెప్పడంపై ఆదేశ రక్షణ శాఖా అధిపతి తీవ్ర అభ్యంతరం తెలిపారు.

అలాంటి పరిస్థితులు అమెరికాలో లేవని మిలటరీ అలాంటి ఆలోచనలు చేయడం లేదని అన్నారు.

బెనిఫిట్ షోల విషయంలో భారీ షాకిచ్చిన సీఎం రేవంత్.. సినిమాల కలెక్షన్లు తగ్గుతాయా?