బిడెన్ ను ఆడేసుకుంటున్న ట్రంప్...2018 లో సంఘటన ట్రంప్ మర్చిపోలేదా....!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు రోజు రోజుకు శ్రుతి మించుతున్నాయి.

ఒక అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడు విరుచుకు పడటం ఇదే తోలి సారి.గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న ఈ సంఘటనలపై అమెరికన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.

ట్రంప్ చేస్తున్న అల్లరి, విసుగు పుట్టిస్తున్న పనులు అమెరికా అధ్యక్షుడు బిడెన్ పరువును రోడ్డుకీడుస్తున్నాయి.

ఈడుస్తున్నాయి.ఏదో ఒక రకంగా వార్తలో ఉండాలని భావిస్తున్న ట్రంప్ రెండు రోజుల క్రితం ఓ బాక్సింగ్ మ్యాచ్ కు వ్యాఖ్యాతగా వెళ్ళిన విషయం విధితమే.

అయితే తాజాగా ట్రంప్ అధ్యక్షుడు బిడెన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టిస్తున్నాయి.

ఫ్లోరిడా లోని హాలివుడ్ లో హెవీ వెయిట్ బాక్సింగ్ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ కు కూడా ట్రంప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.మ్యాచ్ మొదలయ్యే ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తున్నారు.

ఈలోగా ఓ విలేఖరి ప్రశ్న అడుగుతూ మీకు గనుకా బాక్సింగ్ లోకి దిగితే మీ ప్రత్యర్ధి ఎవరు ఉండాలని అనుకుంటున్నారు అని అడిగారు.

దాంతో ఒక్క నిమిషం తడుముకోకుండా నా ప్రత్యర్ధి బిడెన్, అసలు అతడు నా ముందు క్షణం కూడా నిలబడలేదు, క్షణాలలో ఒక్క గుద్దు తో పడగోడుతాను, అంతటి బలహీనమైన అభ్యర్ధి అతడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అయితే ఈ విషయంపై బిడెన్ మద్దతు దారులు ఘాటుగానే స్పందించారు.ఓ అధ్యక్షుడిపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ట్రంప్ కు సూచించారు.

అయితే బిడెన్ మద్దతు దారులు కూడా వీరికి ఘాటుగానే బదులిచ్చారు.2018 లో ఏం జరిగిందో మర్చిపోయారా, అప్పటి సంఘటన మేము మర్చిపోలేదు అంటూ విమర్శించారు.

2018 లో బిడెన్ ఓ ర్యాలీ లో మాట్లాడుతూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశించి బిడెన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

మహిళలపై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలను ఉద్దేశించి బిడెన్ మాట్లాడుతూ.మేము ఇద్దరం ఒకే స్కూల్ లో ఉంది ఉంటె ట్రంప్ మాట్లాడే మాటలకు నేను ముఖంపై గుద్దే వాడిని అన్నారని అప్పుడు బిడెన్ అధ్యక్షుడిపై అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అంటూ ఎదురు దాడికి దిగారు.

ఇదిలాఉంటే ట్రంప్ బిడెన్ పై చేసిన బాక్సింగ్ మాటలకు నెటిజన్లు మాత్రం ఇద్దరినీ బాక్సర్ల తో పోల్చుతూ ఫోటోలు పెట్టి సోషల్ మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారు.

ఎవరికి ఓటు వేయాలో ప్రజలే తేల్చుకోవాలి..: సీఎం జగన్