'ఈబీ-5' మరింత ఖటినం
TeluguStop.com
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన నాటినుంచీ అమెరికాలోని ఎన్నారైలకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు వలస విధానంపై రోజు రోజు కి ఎంతో ఖటినంగా వ్యవహరిస్తున్నాడు.
ఈ తీరుతో ఎన్నారైలు అనేక ఇబ్బందులకి గురవుతున్నా ట్రంప్ తన విధానంలో ఎటువంటి మార్పులు చేయడంలేదు సరికదా ఎన్నారైలకి ఇబ్బందులు కలిగేలా మరిన్ని చర్యలకి పాలపడుతున్నాడు.
అందులో భాగంగానే హెచ్ 1 బీ పై ట్రంప్ చేపట్టిన చర్యలు అందరికీ తెలిసిందే అయితే తాజాగా ట్రంప్ కన్ను ఈబీ- 5 పై పడింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 10మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తే, గ్రీన్‌కార్డును అమెరికా ప్రభుత్వం మంజూరు చేస్తుంది అయితే ఈ ఈబీ-5 విషయంలోనూ నిబంధనలకు కఠిన తరం చేయాలని ట్రంప్ ప్రభుత్వం అనుకుంటోంది.
దీని కనీస పెట్టుబడిని 5మిలియన్ డాలర్లకు పెంచనున్నారని అమెరికన్ కాంగ్రెస్‌మెన్ ఆరోన్ స్కాక్ చెబుతున్నారు.
అయితే వచ్చే ఏడాది జనవరి నుంచీ ఈ నిభందన అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
గత కొంత కాలంగా ఈబీ-5వీసాలను పొందే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రతీ ఏటా 30-40 శాతం వృద్ధి నమోదవుతోందని వచ్చే 3-4నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఈ వీసా విధానానికి సంభందించి యూకే 2మిలియన్ డాలర్లకు పెంచగా.కెనడా ఒక మిలియన్ డాలర్లకు.
ఆస్ట్రేలియా 4 మిలియన్ డాలర్లకు పెంచిందని తెలిపారు.ఈబీ-5వీసా పొందే జాబితాలో భారత్‌మూడో స్థానంలో ఉంది సర్వేలు వెల్లడించాయి.
గుర్తు పట్టనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటీ?