ఇజ్రాయెల్‌, యూదులతో ముడిపెడుతూ.. కమలా హారిస్‌పై ట్రంప్ విమర్శలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల( US Presidential Elections ) బరిలో నుంచి అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే.

ఆయన వెళ్తూ వెళ్తూ భారత సంతతి నేత, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు తన మద్ధతు ప్రకటించారు.

దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా పలు వర్గాల నుంచి సపోర్ట్ దొరుకుతోంది.రేసులో బైడెన్ ఉన్నంత వరకు దూసుకెళ్లిన ట్రంప్.

కమల రాకతో పోల్స్, సర్వేల్లో వెనుకబడుతున్నారు.ఈ నేపథ్యంలో కమలా హారిస్‌పై ఆయన సహా రిపబ్లికన్ మద్ధతుదారులు నేరుగా విరుచుకుపడుతున్నారు.

"""/" / కమలా హారిస్( Kamala Harris )కమలా హారిస్, ఆమె యూదు భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌( Doug Emhoff )లను ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు.

యూదు అమెరికన్లు ఇజ్రాయెల్‌తో ద్వంద్వ విధేయతను చూపుతున్నారని ట్రంప్ దుయ్యబట్టారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో గత వారం జరిగిన సమావేశంలో హారిస్ చిరాకుగా కనిపించారని న్యూయార్క్‌లోని డబ్ల్యూఏబీసీ రేడియోకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ అంటే ఆమెకు ఇష్టం ఉండదని, యూదు ప్రజలను ఇష్టపడదని .ఈ విషయం నాతో సహా అందరికీ తెలుసునని, కానీ ఈ విషయాన్ని చెప్పడానికి ఎవరూ ఇష్టపడరని ట్రంప్ ఎద్దేవా చేశారు.

"""/" / గాజా( Gaza )లో పౌరుల మరణాల సంఖ్యను ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్‌( Israel )కు సైనిక సహాయాన్ని నిలిపివేయాలని కొందరు డెమొక్రాట్లు బైడెన్ పరిపాలనా యంత్రాంగాన్ని కోరుతున్నారు.

ఇజ్రాయెల్‌ తనను తాను రక్షించుకునే హక్కును సమర్ధిస్తూనే.పాలస్తీనా ఇబ్బందులపైనా తాను మాట్లాడతానని కమలా హారిస్ తెలిపారు.

అయితే ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై యూదు ఓటర్లు, డెమొక్రాట్ల మధ్య చిచ్చు పెట్టేందుకు ట్రంప్ చేసిన యత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అంటున్నారు.

ఈ వ్యాఖ్యలు జ్యూయిష్ డెమొక్రాట్ల‌లను టార్గెట్ చేసినట్లుగానే ఉన్నాయని చెబుతున్నారు.2021 నాటి ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం.

ప్రతి 10 మంది అమెరికన్ యూదులలో ఏడుగురు డెమొక్రాటిక్ పార్టీకి మద్ధతుదారులే కావడం విశేషం.

బాలకృష్ణకు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయా..?.