ట్రంప్ కీలక నిర్ణయం: H1B వీసా, గ్రీన్ కార్డ్‌లపై గడువు పెంపు.. భారతీయులకు బిగ్ రిలీఫ్

ప్రస్తుతం కోవిడ్ 19 సంక్షోభంతో చిక్కుల్లో పడ్డ అమెరికాలోని విదేశీయులకు డొనాల్డ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

హెచ్1 బీ వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను సమర్పించేందుకు 60 రోజుల సమయం ఇచ్చింది.

ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ ఆదేశాల ప్రకారం .గ్రీన్ కార్డు దారులు, హెచ్1 బీ వీసాదారులు అవసరమైన పత్రాలు, తిరస్కరించే నోటీసులు, ఉపసంహరించుకునే నోటీసులు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు, ఫారం ఐ-290బీ, నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించిన పత్రాలను 60 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది.

అలాగే అభ్యర్ధనలు, నోటీసుల విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందు 60 రోజుల్లోగా స్పందించాలని యూఎస్‌సీఐఎస్ సూచించింది.

గడువు ముగిసిన వారిపై ఏదైనా చర్య తీసుకునే ముందు నిర్ణీత తేదీ నుంచి 60 క్యాలెండర్ రోజుల వరకు అందుకున్న ఫారం ఐ-290బీను పరిశీలిస్తామని వెల్లడించింది.

"""/"/ కాగా కరోనా విలయతాండవం నేపథ్యంలో ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసదారులపై 60 రోజులు నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండు నెలల పాటు నిషేధం విధించడంతో ఈ సమయంలో వీసా కాలపరిమితి ముగిసే విదేశీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ జాబితాలో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు.ఫెడరల్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తోన్న వారికి రెండు నెలల సమయం దొరికినట్లయ్యింది.

"""/"/ ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం 2.5 లక్షల మంది ఎదురుచూస్తుండగా, వీరిలో 2 లక్షల మంది హెచ్1బీ వీసాదారులే.

రెండు నెలల గ్రేస్ పీరియడ్ ఉండటంతో వీరంతా గడువు ముగిసే సమయానికి అవసరమైన పత్రాలను అమెరికా ప్రభుత్వానికి సమర్పించుకునే వీలు కలుగుతుంది.

హెచ్1బీ వీసా ద్వారా అమెరికాలోని పలు కంపెనీలు విదేశీ నిపుణులకు ఉద్యోగాలు కల్పించే వీలుంటుంది.

దీని ద్వారా ప్రతి ఏటా భారత్, చైనా తదితర దేశాల నుంచి వేల మంది అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.

ఇక గ్రీన్ కార్డు అనేది అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు వీలు కల్పిస్తుంది.మరోవైపు అమెరికాలో సుమారు 11 లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్ సోకగా, వీరిలో 65 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా భారత్‌లో లాక్‌డౌన్ ముగిసిన అనంతరం విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

హిట్3 నచ్చకపోతే మహేష్ రాజమౌళి మూవీ చూడొద్దు.. నాని సంచలన వ్యాఖ్యలు వైరల్!