ట్రంప్ కి నిరసనల స్వాగతం..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలోని ఎల్పాసో నగరాన్ని సందర్శించాలని అనుకున్నారు.అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ట్రంప్ కి ఘనంగా స్వాగతం అందుతుందని అనుకున్న అధికారులు షాక్ అయ్యారు.వేలాదిమంది మంది ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసనల స్వాగతం తెలిపారు.

ఈ ఊహించని పరిణామంతో ట్రంప్ షాక్ అయ్యారు.అమెరికా అధ్యక్షుడికి స్థానిక ప్రజలు వేలాదిగా ఎందుకు నిరసన తెలిపారు అంటే.

"""/"/ టెక్సాస్ రాష్ట్రం ఎల్పోసా నగరంలో గత వారం ఓ దుండగుడు జరిగిన దాడి ఘటన అందరికి తెలిసిందే.

ఈ ఘటనలో ఎంతో మంది అమాయక ప్రజలు మృతి చెందారు.ఈ క్రమంలోనే ట్రంప్ అక్కడ పర్యటన చేపట్టడంతో భాదితులు అందరూ కోపంతో ఊగిపోయారు.

కనీసం గతంలో జరిగిన దారుణ ఘటనకి చర్యలు లేవని, ట్రంప్ స్పందించిన పాపాన పోలేదని అన్నారు.

ఈ నగరానికి వచ్చే ముందు ఇక్కడి ప్రజలకి క్షమాపణలు చెప్పి వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు నగర కమిషనర్.

"""/"/ ట్రంప్ పై అక్కడి ప్రజలకి ఎంతటి కోపం ఉందంటే.నిప్పులు కక్కుతున్న ఎండలో సైతం సుదీర్ఘ సమయం నుంచుని నిరసనలు తెలిపారు.

మేము మనుషులం , మరి నువ్వు మనిషివో కాదో అంటూ ఫ్లకర్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు.

అయితే ఇలాంటి ఘటనలు ఏమి జరగనట్టుగా ట్రంప్ మాత్రం ఎల్పాసో నగర సందర్శన విజయవంతం అయ్యింది అంటూ ట్వీట్ చేశారు.

చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న స్టార్ హీరో…