ట్రంప్ కి అమెరికా సుప్రీం కోర్టు కీలక ఆదేశం

సరిహద్దు గోడ నిర్మాణం అమెరికా వ్యాప్తంగా ఎలాంటి అలజడిని కలిగించిందో అందరికి తెలిసిందే.

అయితే గోడ నిర్మాణం చేయవద్దు అంటూ వచ్చిన ఆదేశాలపై నిషేధాన్ని ఎత్తివేయాలి అంటూ ట్రంప్ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.

దాంతో తాజాగా సుప్రీం కోర్టు రక్షణ నిధులతో సరిహద్దు గోడ నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాలిఫోర్నియా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న ఫెన్సింగ్ లని తొలగించి వాటి స్థానంలో గోడను మరింత బలమైన విధంగా గోడని నిర్మించాలనేది ట్రంప్ ప్రభుత్వ ఆలోచన ఇదే అంశంపై సుప్రీం కోర్టులో భిన్నాభిప్రాయాలు ఏర్పడాయి.

అయినా రక్షణ నిధులు ఉపయోగించుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతులు ఇవ్వడంతో ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇది మా ప్రభుత్వానికి భారీ విజయం అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.ఇదిలాఉంటే సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్ లిబర్టీస్ యూనియన్ తన పోరాటాని కొనసాగిస్తామని తెలిపింది.

"""/"/ ఇది ఎంతో సున్నితమైన అంశం అని ఇంతటితో పూర్తి కాలేదని ఎసిఎల్‌యు నేషనల్‌ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కి చెందిన డార్ర్‌ లాడిన్‌ అన్నారు.

ట్రంప్ నిర్మించనున్న సరిహద్దు గోడతో జరగబోయే నష్టాన్ని ఆపాలని కోరుతూ వేసిన పిటిషన్ లపై విచారణలని త్వరితగతిన చేయాల్సిందిగా ఫెడరల్ కోర్టుని కోరుతామని ఆయన తెలిపారు.

కష్టపడి అలసిపోయిన సురేఖ.. దుబాయ్ ట్రిప్ తీసుకెళ్లిన మెగాస్టార్?