ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా లోపం.. స్టేజ్‌పైకి దూసుకొచ్చిన అగంతకుడు
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) భద్రత అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో పెన్సిల్వేనియాలోని( Pennsylvania ) బట్లర్ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ ఏర్పాటు చేసిన ర్యాలీలో అగంతకుడి దాడి నుంచి ట్రంప్ తృటిలో తప్పించుకున్నారు.
అయితే బుల్లెట్ కుడిచెవి మీదుగా దూసుకెళ్లడంతో ఆయన గాయపడ్డారు.నాటి ఘటనలో ఓ ట్రంప్ మద్ధతుదారుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
"""/" /
ఈ ఘటన నేపథ్యంలో యూఎస్ సీక్రెట్ సర్వీస్( US Secret Service ) తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ తన పదవికి రాజీనామా చేశారు.
మొన్నామధ్య తను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వెనుక సైబర్ దాడి జరిగి ఉంటుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు.
ఇది జరిగిన కొన్నాళ్లకు ట్రంప్‌ను చంపేస్తానంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగాడు.
నిందితుడిని అరిజోనాలోని కోచిస్ కౌంటీ ప్రాంతానికి చెందిన రోనాల్డ్ సివ్రుద్‌గా గుర్తించారు.రోనాల్డ్ కొద్దిరోజులుగా ట్రంప్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
"""/" /
తాజాగా ట్రంప్ ర్యాలీలో( Trump Rally ) మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.
అది కూడా పెన్సిల్వేనియాలోనే కావడం గమనార్హం.జాన్స్‌టౌన్‌లో( Johnstown ) ఏర్పాటు చేసిన ర్యాలీలో మాజీ అధ్యక్షుడు ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి వేదికపైకి దూసుకెళ్లేందుకు యత్నించాడు.
అతను దాదాపుగా ప్రెస్ ఏరియాలోకి ప్రవేశించగా.పోలీసులు, భద్రతా సిబ్బంది అతనిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం.అగంతకుడు ప్రెస్ ఏరియాలో సైకిల్ ర్యాక్‌పైకి ఎక్కేందుకు యత్నించాడు.
దీనిని గమనించిన ట్రంప్ మద్ధతుదారులు, పోలీసులు అతనిని పక్కకి లాగారు.కొద్దిసేపటి తర్వాత నిందితుడి చేతికి సంకెళ్లు వేసి అరేనా నుంచి బయటకు తీసుకెళ్లారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024