ఆయనో మూర్ఖుడు… ఆ సలహాలు వినుంటే: ఫౌసీపై నోరు పారేసుకున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు.ఎవరిని తిడతారో.

ఎవరిని పొగుడుతారో అర్ధం కాదు.ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగే వారికి సైతం ట్రంప్ వ్యవహారశైలి అంతుపట్టదు.

తాజాగా ఆయన మిత్రుడు, కరోనా వైరస్ ఎక్స్‌పర్ట్ ఆంథోనీ ఫౌసీ మీద తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

ఆయన ఓ పెద్ద విపత్తు అని.కరోనా వైరస్ విషయంలో ఫౌసీ సలహాలు వినుంటే మనదేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 5 లక్షలు దాటేదని ట్రంప్ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.ప్రస్తుతం అమెరికాలో కరోనా అదుపులోనే ఉందని.

ప్రజలు కూడా తమను ఒంటరిగా విడిచిపెట్టాలని కోరుతున్నారని గుర్తు చేశారు.ఫౌసీ లాంటి మూర్ఖుల మాటలు విని విని జనం అలసిపోయారని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఎన్నికలకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉండటం.ఇప్పటికే వెల్లడయిన పలు సర్వేల్లో జో బిడెన్ ముందంజలో ఉన్నారు.

అయితే వీటిని ట్రంప్ కొట్టిపారేశారు.ఇవన్నీ చెత్తని.

సరైన సమయంలో తాము పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా.

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభం అయిన నాటి నుంచి ఫౌసీ, ట్రంప్‌తో విభేదిస్తూనే ఉన్నారు.

ట్రంప్‌ నిర్లక్ష్యం వల్లే అమెరికాలో 2 లక్షలకు పైగా మరణాలు సంభవించినట్లు ఫౌసీ ఆరోపించారు.

కానీ ట్రంప్‌ ఆయన మాటలను పట్టించుకోలేదు.చివరకు స్వయంగా ఆయనే కరోనా బారిన పడ్డారు.

ఈ ఏడాది ఏప్రిల్ తొలినాళ్లలో అమెరికాలో లాక్‌డౌన్ విధించాల్సిందిగా ఆయన ట్రంప్‌కు సూచించారు.

కానీ అధ్యక్షుడు వాటిని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు.అంతేకాదు లాక్‌డౌన్‌ విధించాలని ఫౌసీ గట్టిగా నొక్కి చెప్పడంతో అమెరికన్లకు నచ్చలేదు.

లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారాలకు నష్టం సంభవించే అవకాశం ఉందంటూ వ్యాపారవేత్తలతో పాటు ఇతరులు మండిపడ్డారు.

ఈ క్రమంలో ఫౌసీ బెదిరింపులు సైతం ఎదుర్కొన్నారు.ఇదే విషయాన్ని ఆయన.

హెల్త్‌ అండ్‌ హ్యుమన్‌ సర్వీసెస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఫెడరల్ ప్రభుత్వం ఫౌసీకి భద్రత పెంచింది.

ఫౌసీ ఇంటితో పాటు ఆయన వెళ్లే ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఆ పాన్ ఇండియా సినిమాలపై ఫుల్‌ నెగిటివిటీ.. చెర్రీ తారక్‌లకు వణుకు పుడుతోందట..?