ట్రంప్ తీరుతో...భారత టెకీ ల ఉద్యోగాలకి గండి..!!!
TeluguStop.com
ట్రంప్ తీరుతో భారత్ లో ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న టెకీ లకి అవకాశాలు భారీగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.
గత ఏడాది కాలంలో పది పెద్ద ఐటీ కంపెనీలు కొత్తగా 1,14,390 మంది నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చాయనేది అంచనా.
అయితే గత ఏడాదితో పోల్చితే ఈ నియామకాలు నాలుగు రెట్లు పెరిగాయి.అమెరికాలో ఆయా కంపెనీల నియామకాలు పెరగడమే, ఈ పెరుగుదలకి కారణమని హెచ్ఆర్ విభాగం పేర్కొంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత ఐటీ కంపెనీలు అక్కడ స్థానికులకి అవకాశాలని ఇస్తున్నాయి.
దాంతో పాటుగా ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టులు అప్పగించే పెద్ద పెద్ద కస్టమర్లు తమ ఉద్యోగులని విలీనం చేసుకోవాలని షరతులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అమెరికాలో జరిగే నియామకాలతో పాటుగా పెద్ద క్లయింట్లకు చెందిన ఉద్యోగులను ఎంత మందిని చేర్చుకున్నదీ ఐటీ కంపెనీలు ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఈ అనూహ్య పరిణామాలతో భారత్‌లోని ఐటీ ఉద్యోగార్దుల అవకాశాలకు గండి పడుతున్నాయని నిపుణులు అంటున్నారు.