టీఆర్ఎస్ పార్టీలో ఎగిసిపడుతున్న నిరసనల సెగలు.. బిల్డింగ్ ఎక్కిన మహిళా నేత.. ?
TeluguStop.com
టీఆర్ఎస్ పార్టీలో రోజు రోజుకు నిరసనల సెగలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే.కొందరు నేతలు బహిరంగానే నిరసనలు తెలుపుతుండగా, మరికొందరు అసంతృప్తులతో రగిలిపోతు లోలోన కుమిలిపోతున్నారట.
ఈ క్రమంలో కొందరైతే సెల్ టవర్లు, బిల్డింగ్‌లు ఎక్కి తమకు టికెట్ ప్రకటించి బీఫారంలు అందజేయాలని డిమాండ్ చేస్తుండటం చర్చాంశనీయంగా మారింది.
ఇలాగే నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్ది ఒకరు హన్మకొండలోని బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నాలుగు గంటల పాటు హై టెన్షన్ సృష్టించాడు.
ఈ విషయం మరవక ముందే ఇదే నియోజక వర్గానికి చెందిన తుమ్మల శోభారాణి అనే మహిళా నాయకురాలు కూడా హల్ చల్ చేశారు.
కాగా టీఆర్ఎస్ ప్రభుత్వం జనరల్ మహిళ కు రిజర్వేషన్ కెటాయించడంతో 58 వ డివిజన్ నుండి టికెట్ తనకే కేటాయించాలని అదాలత్ సెంటర్ లో ఉన్న ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ ఎక్కి పెట్రోల్ బాటిల్ తో నిరసన వ్యక్తం చేస్తుంది.
అంతే కాకుండా పార్టీలోని కొంతమంది నేతలు తనకు టికెట్ ఇవ్వడానికి రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తుంది ఈ విషయంలో తనకు న్యాయం జరగకుంటే మాత్రం ఇక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా అని పార్టీ నాయకులను హెచ్చరిస్తోంది ఇకపోతే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి బెదిరింపులు తరచుగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
రూ. 5 కోసం కక్కుర్తి.. రూ. లక్ష బొక్క పెట్టించుకున్న క్యాటరింగ్ కంపెనీ (వీడియో)