హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటనపై ఆచీతూచి అడుగులేస్తున్న టీఆర్ఎస్
TeluguStop.com
తెలంగాణలో టీఆర్ఎస్ కంచుకోటగా భావించే నియోజకవర్గాలలో హుజురాబాద్ నియోజకవర్గం ఒకటి.అయితే హుజురాబాద్ కారు డ్రైవర్ ఎవరనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
మొదట ఎల్.రమణను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించినా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.
అయితే ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది.అయితేకెసీఆర్ సమక్షంలోటీఆర్ఎస్ లో చేరినా ఇంకా హుజురాబాద్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.
అయితే హుజురాబాద్ లో కెసీఆర్ దళిత బంధు పధకం వ్యూహాన్ని ప్రయోగించి ఆ తరువాత సానుకూల పరిస్థితులు ఏర్పడిన తరువాత అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈటెలను కెసీఆర్ లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ వ్యూహాలన్నింటినీ బీజేపీ నేతలు తిప్పి కొడుతున్నారు.
హుజూరాబాద్ లో గెలవడం కోసమే దళిత బంధు లాంటి పధకాలను ప్రవేశపెడుతున్నారని, ఇది ఎన్నికల స్టంట్ అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే అభ్యర్థి ప్రకటన విషయంలో తొందరపడవద్దని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.అయితే ఈ పధకాన్ని హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రకటన చేసే అవకాశం ఉంది.
అయితే ముందుగా టీఆర్ఎస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని నిర్ధారించుకున్న తరువాత అభ్యర్థి ప్రకటన ఉండే అవకాశం ఉంది.
బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయడం పుష్ప2 కు సాధ్యమేనా.. బన్నీ రేంజ్ డిసైడ్ కానుందా?