మునుగోడు ఉపఎన్నికపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి..!
TeluguStop.com
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది.
దీనిలో భాగంగా జిల్లా వామపక్ష నేతలతో మంత్రి జగదీశ్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారని తెలుస్తోంది.అదేవిధంగా మండల, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు ఎలా వెళ్లాలనే దానిపై చర్చించారు.
అనంతరం పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి, పల్లా వెంకట్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.
మునుగోడులో బీజేపీని ఓడించడమే లక్ష్యమని వామపక్ష నేతలు చెబుతున్నారు.
భోజనానికి ముందు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగితే ఏం అవుతుందో తెలుసా?