కేసీయార్ బాహుబలిలో కట్టప్పలా ఈటలకు వెన్నుపోటు.. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు.. ?

తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ వ్యవహారం రాజకీయ రూపురేఖలనే మార్చేసేలా ఉన్నాయా అనే అనుమానాలు కొందరిలో వస్తున్నాయట.

రాజేందర్ చేసిన తప్పు పై పూర్తి క్లారీటి ఇవ్వలేని ప్రభుత్వం హడావుడిగా ఆయన పై చర్యలు తీసుకోవడం అంత నీచమైన పని లేదని ఈటల అభిమానులు వాపోతున్నారట.

ఈ క్రమంలో ఈటల నియోజక వర్గం నుండి, ఆయన అభిమానుల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెలువడుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించడం రాజకీయాల్లో చర్చగా మారింది.

నేడు ఈటల, రానున్న రోజుల్లో మరెవరో, అంటే రాజకీయ లబ్ధి కోసం గులాభి బాస్ ఏ పని చేయడానికి కూడా, ఎవరిని బలి చేయడానికి కూడా వెనుకాడడానే సంకేతాలు ఇచ్చినట్లే అని ఇప్పటికే మిగతా నేతల్లో గుబులు మొదలైందట.

ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరిపై ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉద్యమ కారుడైన ఈటల రాజేందర్‌ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని, ఉద్యమ ప్రస్థానం నుండి వెన్నంటి ఉన్న ఈటలకు బాహుబాలి సినిమాలో కట్టప్పలా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలపై చేపడుతున్న కక్ష్య పూరితమైన చర్యలకు నిరసనగా తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని షాకింగ్ న్యూస్ చెప్పారు.

ఎలా ఉండే నయనతార ఎలా మారిపోయింది ? కారణం ఏంటి ?