వైఎస్ షర్మిల పాదయాత్రకు టీఆర్ఎస్ నిరసన సెగ
TeluguStop.com

వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో చెన్నారావుపేటలో ఆమె పాదయాత్రకు టీఆర్ఎస్ నిరసన సెగ తగిలింది.ఈ మేరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున రోడ్లపైకి చేరుకుంటున్నారు.


అనంతరం ఫ్లెక్సీలు దహనం చేసి నిరసనకు దిగారు.దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కార్యక్రమం చేపట్టిన టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎన్టీఆర్ వైఫ్, మహేష్ లేటెస్ట్ పిక్స్ మీరు చూశారా.. వాళ్ల సక్సెస్ కు వీళ్లే కారణమంటూ?