ఆపరేషన్ ఉత్తరప్రదేశ్ ! బిజేపి ని దెబ్బకొట్టేలా టీఆర్ఎస్ ?

తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీచేలా చేసేందుకు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ కు ధీటుగా బలపడేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసుకుంటూ,  బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

దీనికి తోడు కేంద్ర బిజెపి పెద్దలు సైతం ప్రభుత్వపరంగా, పార్టీపరంగానూ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకోవడంతో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు.

దీనిలో భాగంగానే త్వరలో జరగబోతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తాజాగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

మోదీ ప్రభుత్వం ఏడేళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిందని, బిజెపి దేశవ్యాప్తంగా ప్రజ సంక్షేమం ను పట్టించుకోలేదని,  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని ఇంకా వెనుకబడే ఉన్నాయని, అక్కడ ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారనే విషయాన్ని హైలెట్ చేసి దేశవ్యాప్తంగా బీజేపీ నీ దెబ్బ కొట్టాలనే వ్యూహం టిఆర్ఎస్ పన్నుతోంది.

అందుకే బిజెపికి వ్యతిరేకంగా సమాజ్ వాది పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు టీఆర్ఎస్ కు చెందిన కొంతమంది నేతలు ఉత్తరప్రదేశ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

టీం కేటీఆర్ పేరిట మూడు బృందాలు రెడీ అవుతున్నాయి. """/"/ ఉత్తరప్రదేశ్ లో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరికొంతమంది ఆధ్వర్యంలో ఈ బృందాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం తో పాటు,  ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం , బిజెపికి వ్యతిరేకంగా యాదవ సామాజిక వర్గం లో అవగాహన కల్పించాలనే ప్లాన్ లో టిఆర్ఎస్ ఉందట.

  దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అన్నిటినీ ఏకం చేసే విధంగా, బిజెపి 2024 ఎన్నికల్లో ఓటమి దక్కేలా టిఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది.

అయితే ప్రస్తుతం సమాజ్ వాది పార్టీతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో దానిపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కేసిఆర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారట.

Atchennaidu : మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట