టీఆర్ఎస్ కు ' రచ్చబండ ' గుబులు ? ఏం చేయబోతున్నారంటే ? 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.ముఖ్యంగా నిరాశా నిస్పృహల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో వరంగల్ సభ ఊపిరి పోసింది.

పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఏం చేయాలనే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణలో పట్టు పెంచుకోవడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పనిచేయాలని సూచించారు.దీంతో పాటు అనేక ప్రజా ఉద్యమాలను చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంగా ముందడుగు వేశారు .

ఈ నేపథ్యంలోనే రైతు రచ్చబండ పేరుతో కాంగ్రెస్ నేతలు నేటి నుంచి గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని నిర్ణయించారు.

ఈరోజు జరిగిన రైతు రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ కీలక నేతలంతా పాల్గొని టిఆర్ఎస్ విమర్శలు గుప్పించారు.

ఇప్పటికే వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు జనాల నుంచి సానుకూలత ఏర్పడింది .

దీంతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందనే సంకేతాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

దీంతో రచ్చబండ కార్యక్రమాలు అడ్డుకోవాల్సిందిగా టిఆర్ఎస్ నేతలకు మౌఖికంగా ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

దీనికి అవసరం అయితే పోలీసుల సాయం కూడా తీసుకోవాలని, రైతు రచ్చబండ కార్యక్రమానికి పెద్ద జనాలు హాజరు కాకుండా చూడాల్సిందిగా టిఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి నాయకులు అందరికీ ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తోంది.

"""/" / కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టిఆర్ఎస్ ఎత్తుగడలను తిప్పికొడుతూ.

రైతు రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని , వరుసగా ఈ తరహా కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతూ, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెంచాలని భావిస్తోంది.

దీనికి సంబంధించి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కమిటీలను సైతం నియమించి పార్టీ కీలక నాయకులంతా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఈ కార్యక్రమాల్లోనే కేంద్ర అధికార పార్టీ బీజేపీ విధానాలను , తెలంగాణ అధికార పార్టీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఎం.ఎస్. ధోనీ జెర్సీ నంబర్ 7 ఎంచుకోవడానికి కారణం ఏంటి.. ?