బీజేపీ ని అడ్డుకోవడంలో మేము సఫలం అంటున్న ఎం‌ఎల్‌సి కవిత

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు టి‌ఆర్‌ఎస్ కు చేదును మిగిలించింది.మొత్తం 150 డివిజన్ లకు గాను టి‌ఆర్‌ఎస్ పార్టీ 55 గెలవగా బి‌జే‌పి 48, ఎం‌ఐ‌ఎం పార్టీ 44.

డివిజన్లో గెలిచింది.మరో డివిజన్ ఫలితం మాత్రం కోర్ట్ ఆదేశాలతో ఆగిపోయింది.

హైదరాబాద్ మేయర్ పిటానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది.ఇక తమ మిత్రా పార్టీ గా చెప్పుకుంటున్న ఎం‌ఐ‌ఎం పార్టీ మద్దతు తీసుకొనున్నదని సమాచారం.

టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బి‌జే‌పి పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జాతీయ స్థాయి నాయకులను హైదరాబాద్ కు పిలిపించి ఇక్కడి ఓటర్లను కన్ఫ్యూజ్ చేశారు అన్నారు.

ప్రతిసారి బి‌జే‌పి ఇదే వ్యూహాన్ని అనుసరించి గెలుస్తుంది.హైదరాబాద్ లోని 150 డివిజన్లకు గాను మేము అంచనా వేసుకున్నాదానికన్న ఓ 12 స్థానాలు తక్కువ వచ్చాయి.

వాటిపై మేము చర్చించి ఆత్మపరిశీలన చేసుకుంటాం అన్నారు.2023 ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది.

టి‌ఆర్‌ఎస్ పార్టీ కి 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని గుర్తుచేసింది.హైదరాబాద్ లో బి‌జే‌పి అతి పెద్ద పార్టీ గా అవతరించకుండా టి‌ఆర్‌ఎస్ పార్టీ అడ్డుకుంటుందని కవిత అన్నారు.

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం వార్తలపై స్పందించిన పేర్ని నాని..!!