నోరు జారిన కేసీఆర్ ... చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ?

ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండాలి.ఆ క్లారిటీ మిస్ అయితే కొత్త చిక్కులు ఎన్నో చుట్టుముట్టి ఇబ్బందులు పెడతాయి.

ఇప్పుడు అదే రకమైన ఇబ్బంది తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై కెసిఆర్ మాట్లాడిన మాటలు ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారాయి.

హుజురాబాద్ ఎన్నికల్లో గట్టెక్కేందుకు కేసీఆర్ ఉన్నపళంగా భారీ బడ్జెట్ తో కూడుకున్న కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న క్రమంలో కేసీఆర్ కూడా దాన్ని సమర్థిస్తూ మాట్లాడారు.

ముఖ్యంగా దళిత బంధు పథకం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో, కెసిఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

టిఆర్ఎస్ సన్నాసుల పార్టీ కాదని, రాజకీయ పార్టీ అని కెసిఆర్ మాట్లాడారు.హుజురాబాద్ ఎన్నికలలో గెలిచేందుకే ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఆయన స్వయంగా చెప్పారు.

ఎన్నికలప్పుడు వేల కోట్ల రూపాయలను అభివృద్ధికి కేటాయించడంలో తప్పేముంది అంటూ కెసిఆర్ వ్యాఖ్యానించడం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది.

అంటే వేల కోట్ల రూపాయలతో ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఉప ఎన్నికలు రావాల్సిందేనా అనే అభిప్రాయం ప్రజల్లో కలగడంతో, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలకు పెద్దఎత్తున డిమాండ్ లు వినిపిస్తున్నాయి.

తాజాగా కెసిఆర్ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అంటూ కొంతమంది వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

"""/"/ మేడ్చల్ ,మల్కాజ్ గిరి ఎస్సీ, మహిళా మోర్చా నాయకులు పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వినిపిస్తూ ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

శేర్ లింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు వస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న దళితులకు కూడా పది లక్షలు, వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతాయని డిమాండ్ చేస్తుండటం, మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి దాదాపు కనిపిస్తుండటంతో కేసీఆర్ మాటలు ఎంత ఇబ్బంది తెచ్చిపెట్టాయో అంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్యే లు గుబులు చెందుతున్నారు.

అదృష్టం అంటే ఇదే కాబోలు.. రెప్పపాటులో ప్రమాదం నుండి తప్పించుకున్న బైక్ రైడర్స్..