షర్మిల పార్టీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ?

ఇతర పార్టీ లకు చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ, దూకుడుగా ఉంటూ వస్తున్న టిఆర్ఎస్ పార్టీకి గట్టి షాకే తగిలినట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం హుజురాబాద్ రాజకీయాలపైనే ఎక్కువగా టిఆర్ఎస్ దృష్టి పెట్టింది.అక్కడ గెలవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తోంది.

సొంత పార్టీలోనూ ఎక్కడా అసంతృప్తులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది.అయితే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అకస్మాత్తుగా షర్మిల భర్త అనిల్ ను కలవడం చర్చనీయాంశం అవుతోంది.

గత కొంతకాలంగా టిఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఆయన ఉన్నారు.

ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కడియం శ్రీహరి కి రాజయ్య కు ఏమాత్రం పొసగడం లేదు.

అయితే తనకు కాకుండా కడియం శ్రీహరికి కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజయ్య పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ను లోటస్ పాండ్ లో రాజయ్య కలిసారు.

గతంలోనూ షర్మిలతో అనేకసార్లు రాజకీయ భేటీ అయ్యారు.దీంతో ఆయన పార్టీ మారాలని చూస్తున్నారని, అందుకే షర్మిల పార్టీలో  చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

కెసిఆర్ ఇటీవల కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా కడియం శ్రీహరి ఇంట్లో భోజనం చేయడం, ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉండడం వంటి పరిణామాలు రాజయ్యలో తీవ్ర అసంతృప్తిని రాజేస్తున్నాయి.

 ఈ నేపథ్యంలోనే ఆయన అనిల్ కుమార్ తో భేటీ కావడం తో, త్వరలోనే ఆయన ఆ పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది.

"""/"/ ఈ పరిణామాలపై టిఆర్ఎస్ అధిష్టానం చాలా జాగ్రత్తగానే ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే షర్మిల పార్టీలో కి పెద్దగా ఇతర పార్టీల నేతలు వచ్చి చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు.

తెలంగాణలో ఆమె పార్టీ ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుందని చాలా మంది నాయకులు నమ్మకంతో ఉన్నారు.

దీంతో తీవ్ర అసహనంతో రాజయ్య ఉన్నారు.ఈ క్రమంలోనే రాజయ్య వంటి సీనియర్ నాయకుడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే తమ పార్టీలో చేరితే మరింత మేలు జరుగుతుందనే లెక్కల్లో షర్మిల ఉన్నారట.

వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు… సంచలన వ్యాఖ్యలు చేసిన నికోలయ్?