కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నూతనంగా ఎలాంటి విద్యాలయాలు, నిధులు కేటాయించ లేదు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ పీజీ కళాశాలలో 11కోట్ల రూపాయల తో నిర్మించిన కొత్త బాలుర హాస్టల్ ను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ.

హాజరైన ఎమ్మెల్సీ సురభి వాణి దేవి,ఉన్నత విద్యామండలి చైర్మన్ లింభాద్రి,ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్.

జి ప్లస్ మూడు అంతస్తులతో 108 గదులలో 300 మంది విద్యార్థులకు వసతి.

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు నూతనంగా ఎలాంటి విద్యాలయాలు, నిధులు కేటాయించ లేదు.

కేంద్రానికి అధిక ఆదాయం ఇస్తున్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది.నిధుల కేటాయింపుల్లో మాత్రం చివరి స్థానంలో ఉంది.

ఏడేళ్లలో దేశంలో అనేక విద్యా సంస్థలు ఇచ్చిన కేంద్రం.తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు.

ఏమిటి ఈ వివక్ష దేశంలో తెలంగాణ భాగం కాదా.రాష్టానికి నిధులు ఇవ్వరా.

కేంద్రం ఏమి ఇవ్వకున్న సీఎం కేసీఆర్ గారి సంకల్పంతో రాష్ట్రంలో 959 గురుకులాలను ప్రారంభించాం.

కేంద్రం పైసా ఇవ్వకున్న పాఠశాల విద్య కోసం 11,735 కోట్లు, ఉన్నత విద్య కోసం 1873 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

మన ఊరు మన బడి కార్యక్రమంతో పాఠశాలల అభివృద్ధికి 7289 కోట్ల తో ప్రణాళికలు.

తొలిదశలో 3497 కోట్ల తో 9123 పాఠశాలల అభివృద్ధి.

కుమారుడిని కృష్ణుడిలాగా అలంకరించిన ముస్లిం దంపతులు.. వీడియో చూస్తే ఫిదా..?