ఉలుకుపలుకు లేకుండా టీఆర్ఎస్ నేతలు... అసలు కారణమిదే?

ఈటెల రాజేందర్ అంశం తెరాసలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పార్టీలో గంభీర వాతావరణం నెలకొంది.

ఈటెల భూములను ఆక్రమించాడనే పేరుతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊబిలో కేసీఆర్ ఇరుక్కునేలా కనిపిస్తోంది.

దేవరయాంజల్ భూముల కొనుగోళ్ళ విషయంలో ఈటెల భూములపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈటెలను ఈ విషయంలో దోషిగా తేల్చుదామనుకున్న ప్రభుత్వానికి ఇక్కడ కూడా చుక్కెదురయిందని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది.

ఎవ్వరు కూడా ఈ విషయంపై బహిరంగంగా స్పందించడానికి ఇష్టపడటం లేదు.ఎందుకంటే ప్రభుత్వం ఆరోపణను నిరూపించడానికి ఆపసోపాలు పడుతోంది.

ఇక ఏమి మాట్లాడితే ఎటువంటి సమస్య వస్తుందేమో నని టీఆర్ఎస్ నేతలు మౌనం వహిస్తున్న పరిస్థితి ఉంది.

మరి ఈటెల వ్యవహారం ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుందా లేక వ్యతిరేకంగా మారుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

అయితే ఇప్పుడిప్పుడే కొంత మంది నేతలు అందుబాటులో లేకుండా పోతున్న పరిస్థితి ఉంది .

అయితే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు మౌనం వహించడంతో ఇది దేనికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోతున్న పరిస్థితి ఉంది.

మరి ఈ నిశబ్ద విప్లవం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

కాపీ కొట్టి సినిమా తీసి బొక్క బోర్లా పడ్డ స్టార్ హీరోలు !