ఈటల రాజేందర్ పై కడియం శ్రీహరి సీరియస్ కామెంట్స్..!!
TeluguStop.com
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి కాషాయ కండువ కప్పుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ రోజు తిరిగి ఢిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న సమయంలో ప్రత్యేక విమానం బయలుదేరే క్రమంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో త్రుటిలో ప్రమాదం తప్పటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై టిఆర్ఎస్ లీడర్ కడియం శ్రీహరి ఈటల రాజేందర్ పై సీరియస్ కామెంట్ చేశారు.
తొలి రోజే ఈటలకు పరాభవం ఎదురయింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఎందుకు జాయిన్ అవ్వలేదని ప్రశ్నించిన ఆయన తొలిరోజే పరాభవం ఎదురయింది అని అన్నారు.
అంత మాత్రమే కాక కమ్యూనిస్టు భావజాలం ఎక్కడికి పోయింది అని ప్రశ్నించారు.కేవలం ఆస్తులను కాపాడుకోవడానికి ఈటెల రాజేందర్ బిజెపిలో జాయిన్ అయ్యారు అని వెల్లడించారు.
ఇక బీజేపీ తెలంగాణలో అస్థిరత్వం తీసుకురావటానికి బిజెపి కుట్ర పన్నిందని ఆరోపించారు. """/"/ యనమల కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి బెంగాల్ లో బిజెపి విఫలమయిందని కడియం శ్రీహరి సీరియస్ కామెంట్లు చేశారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజల ఆదరణ టిఆర్ఎస్ పార్టీకే అని స్పష్టం చేశారు.
నా ఎదుగుదలకు కారణం ఆయనే.. వైరల్ అవుతున్న బన్నీ షాకింగ్ కామెంట్స్!