ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో జోష్ లో టీఆర్ఎస్...నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

తెలంగాణలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సమరం ముగిసింది.టీఆర్ఎస్ ఒకటో, రెండో స్థానాల్లో ఓడిపోతారని అనుకున్న పరిస్థితుల్లో అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడంతో టీఆర్ఎస్ లో ఒకప్పటి జోష్ మరల కనిపించిందని చెప్పవచ్చు.

అయితే వరుస ఉప ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశలో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

అంతేకాక తెలంగాణ భవన్ లో చాలా రోజుల తరువాత కార్యకర్తల కోలాహలం, విజయోత్సవ సంబరాలతో టీఆర్ఎస్ లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

అయితే ఇక ఇదే ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమయ్యే అవకాశం ఉంది.ఇక ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, వైఎస్​ఆర్​టీపీ పార్టీలు టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.

బీజేపీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే సోషల్ మీడియా పరంగా కావచ్చు లేదా భౌతిక విమర్శలు కావచ్చు బీజేపీ విమర్శలను టీఆర్ఎస్ బలంగా తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది.

"""/" / అయితే ఇక ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయడంతో ఇక క్షేత్ర స్థాయిలో అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి ఇటు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వరుస సమావేశాలు ఏర్పాటు చేసి ఒకప్పటి జోష్ ను తిరిగి తీసుకురావాలన్నది టీఆర్ఎస్ అధినాయకత్వం ప్రధాన వ్యూహంగా అనిపిస్తోంది.

అయితే ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికలపై అంతగా స్పందించని టీఆర్ఎస్ రానున్న రోజుల్లో తమ వ్యూహాన్ని బహిర్గతం చేసే అవకాశం కనిపిస్తోంది.

ఏది ఏమైనా టీఆర్ఎస్ కు భారీ పోటీ ఉండే అవకాశం ఉంది.

త్రిష, విజయ్ గురించి కొత్త సుచీ లీక్స్.. పెద్దగా దుమారమే రేపుతున్నాయిగా..??