నిరుద్యోగులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

నిరుద్యోగులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభత్వానికి ప్రజలపట్ల చిత్తశుద్ది లేదని,అన్ని వర్గాల అభివృద్ధిని విస్మరించిందని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

నిరుద్యోగులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

శుక్రవారం పేట మున్సిాలిటీల్లో వార్డు వార్డుకు కాంగ్రెస్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ఆరవ రోజు 25,40 వార్డుల్లో కొనసాగించారు.

నిరుద్యోగులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్,ఫీజు రీయంబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని,ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు.

రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నేటికీ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దారుణమన్నారు.

9 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఏ ఒక్క రోజైనా వార్డులో పర్యటించాడా అని ప్రశ్నించారు.

రాష్ట్ర మంత్రికి ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత లేదని,కేవలం సీఎం కేసీఆర్ ను పొగడమే బాధ్యతగా పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.

వార్డులలో మురుగునీరు నిలిచి,దోమలు పెరిగిపోయి ప్రజలు బాధపడుతుంటే కనీసం పట్టించుకునే నాథుడు లేడన్నారు.

కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త డబ్బాలను ఇచ్చి ప్రతిరోజు చెత్త సేకరించడం జరిగిందని,వారానికి ఒకసారి దోమల మందు కొట్టేవారని గుర్తు చేశారు.

వార్డుల్లో పింఛన్లు ఇవ్వడం లేదని,కొత్త రేషన్ కార్డుల ఊసే లేదన్నారు.ప్రజా ఉద్యమాలు నిర్వహించుకుంటూ ప్రజల ఆశీర్వాదాలతో గ్రామస్థాయి నుండి ఎదిగిన నేను పాదయాత్ర పేరుతో రాజకీయాలు చేయడానికి రాలేదని,ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వచ్చానన్నారు.

ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తే ప్రజలు త్వరలోనే టీఆర్ఎస్ నాయకులను గ్రామాలలోకి రాకుండా తరిమి కొడతారని తెలిపారు.

టిఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం అభివృద్ధి చేయాలని కోరిక ఉన్నా గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

సూర్యాపేట పట్టణంలో 15 వేల మందికి పైగా నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం మంత్రి జగదీశ్ రెడ్డి 192 మందికి అందజేసి చేతులు దులుపుకున్నాడని మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలనలో 25వేల ఇందిరమ్మ ఇళ్లను మహిళలకు కట్టించిందని,కాంగ్రెస్ పార్టీ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు 15 రోజులకు సరిపోను మందులు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించిందని గుర్తు చేశారు.

ప్రతి వార్డులో 6 నుంచి 8 మంది సిబ్బంది అవసరం కాగా టిఆర్ఎస్ నాయకులు వార్డు కౌన్సిలర్ తమ ఇండ్లలో నలుగురు పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయించుకుంటున్నారని అన్నారు.

వెంటనే పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని,లేని పక్షంలో మునిసిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

గత ఆరు రోజులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేస్తుండగా టిఆర్ఎస్ నాయకులకు అధికారులకు భయం పట్టుకుందని,వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు చెప్తున్నారని,ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం అవసరమైతే అర్ధరాత్రి కూడా పాదయాత్ర చేస్తానని తెలిపారు.

భారతీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు పై కొత్త సవాళ్లు?

భారతీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు పై కొత్త సవాళ్లు?