బీజేపీ విధానాన్ని అనుసరిస్తున్న టీఆర్ఎస్...అసలు వ్యూహం ఇదేనా?

ప్రస్తుతం రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ పోటాపోటీ వాతావరణం నెలకొన్న తరుణంలో ఆసక్తికరంగా మారుతున్నాయి.

ప్రస్తుతం చాలా వరకు సోషల్ మీడియా హవా అన్నది పెద్ద ఎత్తున నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు బహిరంగ సభలు, మేనిఫెస్టోలు ప్రామాణికంగా ఎన్నికలు జరిగేవి.కాని ఇప్పుడు సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత రాజకీయ పార్టీల గెలుపు లెక్కలు అనేవి పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది.

ఇక తెలంగాణ రాజకీయాల విషయానికొస్తే సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించిన పార్టీ బీజేపీ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

ఎందుకంటే టీఆర్ఎస్ తో పోలిస్తే సోషల్ మీడియా పరంగా బీజేపీ కాస్త బలంగా ఉన్నా టీఆర్ఎస్ సోషల్ మీడియా పరంగా తన బలాన్ని పెంచుకోవడంపై అంతగా దృష్టి కేంద్రీకరించనటువంటి పరిస్థితి ఉంది.

కాని ఆ తరువాత జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్ ఇక కాస్త జాగ్రత్త పడుతూ బీజేపీ సోషల్ మీడియా అస్త్రాన్ని టీఆర్ఎస్ కూడా ప్రయోగిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాపై పెద్ద ఎత్తున దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఇక బీజేపీపై టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్  పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ బీజేపీని భారతీయ జోకర్స్ పార్టీగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్న పరిస్థితి ఉంది.

"""/" / అంతేకాక ఇంకా రాను రాను మరింతగా టీఆర్ఎస్ తమ సోషల్ మీడియా బలాన్ని పెంపొందించుకోవడమే కాకుండా ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క మంచి పనులను, సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మార్చి ప్రతిపక్షాలకు పెద్ద ఎత్తున కౌంటర్ ఇవ్వాలనే  వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

దీంతో బీజేపీకి ఇటు సోషల్ మీడియాలో చెక్ పెట్టి ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మీద హరీష్ శంకర్ అలాంటి సీన్లు పెట్టడం కరెక్టేనా..?