ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టి.. గెలిచి నిలిచేనా

ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నెలకొన్న విషయం తెలిసిందే.ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా జోరుగా సాగుతున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది.

తెలంగాణలో ఉన్న అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది.

అయితే ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితో టీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వకుండా ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిస్తున్న పరిస్తితులో అసంతృప్తిగా ఉన్న స్థానిక నాయకత్వాన్ని టీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగిస్తున్న పరిస్థితి ఉంది .

అయితే తాజాగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒకటో రెండో ఒడిపోతే పెద్దగా నష్టమేముంది రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని  ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎక్కడో టీఆర్ఎస్ కు గెలుపుపై అప నమ్మకంగా ఉన్నారని సరికొత్త ప్రచారం ఊపందుకున్న విషయం తెలిసిందే.

ఇక ఆ తరువాత ఓ మంత్రి ఓ ఎంపీటీసీతో చేసిన వాయిస్ రికార్డు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

అంతేకాక గోవా క్యాంపులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంబంధించిన గుర్రం స్వారీకి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

ప్రస్తుతం టీఆర్ఎస్ మద్దతిస్తున్న స్థానిక నాయకత్వాన్ని తమ వైపుకు లాగి టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలోనే అందరినీ క్యాంపుకు తరలించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఏది ఏమైనా సర్వ శక్తులు ఒడ్డైనా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు ప్రయత్నిస్తుంది.

కానీ ఏదైనా సంచలన మలుపులు తిరిగితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఒకరో ఇద్దరో ఒడిపోయినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేని పరిస్థితి ఉంటుంది.

ఈ ఇయర్ సెకండాఫ్ లో సందడి చేయనున్న మన స్టార్ హీరోలు…