ఎందుకు ఓడిపోయాడో చెప్పిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ

టీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొంది టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ తన మనసులోని భావాలను, అనుభవాలను మీడియా ముందు పంచుకున్నారు.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా బరిలోకి దిగిన వినోద్ ఓటమి చెందారు.

అయితే అప్పుడు తాను ఓటమి చెందడానికి కారణం ఏంటో వినోద్ చెప్పుకొచ్చారు.లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోవడం తనకు పెద్ద గుణపాఠం అంటూ వినోద్ బాధపడ్డారు.

తాను తప్పకుండా గెలుస్తాను అనే ధీమాతోనే ప్రచారం గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉండిపోవడం వల్లే తాను కరీంనగర్ స్థానంలో ఓడిపోయానని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లో గెలుపోటములు తనకు సమానమేనాని, ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదని వినోద్ అన్నారు.టీఆర్ఎస్ పార్టీ అవిరాభవించినప్పుడు అసలు తాము ఎంపీలు, మంత్రులు అవుతామని ఊహించలేదని, కేసీఆర్ కూడా సీఎం అవుతారని అనుకోలేదన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తధ్యమంటూ వినోద్ జోస్యం చెప్పారు.పార్టీ ఎంత గొప్పగా ఆలోచించినా కొన్ని సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బందులు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.

నకిలీ పత్రాలతో ఎన్ఆర్ఐ భూమి విక్రయం.. సబ్ రిజిస్ట్రార్ సహా 9 మంది అరెస్ట్