తెలంగాణలో కాంగ్రెస్ జెండా పీకేయడమేనా ! టీఆర్ఎస్ దెబ్బకి కాంగ్రెస్ భూస్థాపితం

తెలంగాణలో కాంగ్రెస్ జెండా పీకేయడమేనా ! టీఆర్ఎస్ దెబ్బకి కాంగ్రెస్ భూస్థాపితం

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పై మొదలెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ అంకం తుది దశకి వస్తుంది.

తెలంగాణలో కాంగ్రెస్ జెండా పీకేయడమేనా ! టీఆర్ఎస్ దెబ్బకి కాంగ్రెస్ భూస్థాపితం

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ తరుపున మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచినా ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ని ప్రయోగించింది.

తెలంగాణలో కాంగ్రెస్ జెండా పీకేయడమేనా ! టీఆర్ఎస్ దెబ్బకి కాంగ్రెస్ భూస్థాపితం

దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరుగా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్నారు.

ఇప్పటికే పది మంది వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.

దీంతో వారి సంఖ్య ఇప్పుడు తొమ్మిదికి పడిపోయింది.ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఖమ్మం, వరంగల్ జిల్లాలకి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధమై ఉన్నారని, కేసీఆర్ ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడు నేరుగా అతనిని కలిసి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 19 స్థానాలలో 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ శాశనసభ పక్షం టీఆర్ఎస్ లో విలీనం అయినట్లే.

ఇక లోక్ సభ ఎన్నికల ఫలితాల లోపు విలీన ప్రక్రియని కేసీఆర్ పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.

ఎన్నో ఆశలు పెట్టుకొని తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి టీఆర్ఎస్ అధినేత జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ని ఈ విధంగా ఇస్తున్నాడని ఇప్పుడు రాజకేఏయ వర్గాలలో వినిపిస్తుంది.

అక్రమ వలసదారుల బహిష్కరణ .. పంజాబ్ పోలీసులపై బాధితుల ఆరోపణలు

అక్రమ వలసదారుల బహిష్కరణ .. పంజాబ్ పోలీసులపై బాధితుల ఆరోపణలు